జాతీయ వార్తలు

చిక్కుల్లో చిన్మయానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాహజాన్‌పూర్(యూపీ), సెప్టెంబర్ 14: బీజేపీ మాజీ శాసన సభ్యుడు చిన్మయానందపై ఉచ్చు బిగుసుకుంటోంది. పీజీ విద్యార్థినిపై అత్యాచారం చేసినట్టు వచ్చిన అభియోగాలకు బలం చేకూరుతోంది. బాధిత విద్యార్థిని తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి 43 వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను సిట్ పోలీసులకు శనివారం అప్పగించింది. మాజీ కేంద్ర మంత్రి చిన్మయానంద అత్యాచారానికి పాల్పడినట్టు ఏమైనా సాక్ష్యాలుంటే ఇవ్వాలని సిట్ పోలీసులు బాధితురాలిని కోరారు. బాధిత విద్యార్థినిని శుక్రవారం సీట్ అధికారులు ప్రశ్నించారు. ఇలా ఉండగా చిన్మయానంద పడక గది నుంచి కొన్ని ఆధారాలు విచారణ అధికారులు సేకరించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సుప్రీం కోర్టు ఆదేశం మేరకే ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఏర్పాటైంది. శుక్రవారం ఉదయం బాధిత విద్యార్థినిని వెంటబెట్టుకుని మాజీ మంత్రి ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. అక్కడ ఐదు గంటల పాటు విచారణ సాగింది. అలాగే అత్యాచార బాధితురాలు తల్లిని శనివారం విచారణ అధికారులు ప్రశ్నించారు. బీజేపీ నేత చిన్మయానంద కేంద్ర మంత్రిగా పనిచేశాడు. ఆయన సారధ్యంలోని సంస్థ ఆధ్వర్యంలో అనేక కళాశాలలు నడుస్తున్నాయి. పోలీసు లైన్‌లోని సంస్థ కార్యాలయం, చిన్మయానంద పడకగదిలో గురువారం రాత్రి సుమారు ఏడు గంటలపాటు సిట్ తనిఖీలు చేపట్టింది. దివ్యాధాంలోని చిన్మయ ఇంటిని పోలీసుల సీజ్ చేశారు. ఫొరెన్సిక్ నిపుణులు నిందితుడి ఇంటికి సందర్శించారు. ఈ కేసుకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు చెరిపేశారని బాధితురాలు ఆరోపించింది. చిన్మయ పడక గదికి కొత్తగా రంగులు వేశారని, కొన్ని ఆనవాళ్లు లేకుండా చేశారని సిట్‌కు ఆమె తెలిపింది. కొన్ని కీలకపైన ఆధారాలు తొలగించారన్న బాధితురాలు ‘రెండు ఆయుల్ పాత్రలు, మసాజ్‌కు ఉపయోగించే సామాగ్రిని సిట్ కనుగొంది’అని ఆమె వెల్లడించారు. ఇలా ఉండగా నిందితుడు ఉపయోగించిన టవల్, టూత్‌పేస్ట్, సబ్బు, బ్రష్‌ను పరీక్షల నిమి త్తం ఫొరెన్సిక్ నిపుణులు స్వాధీనం చేసుకున్నారు. పీజీ విద్యార్థిని ఫిర్యాదుపై సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశం పొందాక చిన్మయానంద అనుచరుడొకరు పిలిచారని ఆమె వెల్లడించారు. తనను చిన్మయానంద ఇంటిపై అంతస్తుపైకి తీసుకెళ్లారని అన్నారు. తనకు మాజీ మంత్రి గదిలోకి తీసుకెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ సన్నివేశం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె వాపోయింది. తాను స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోను చిన్మయానంద తనకు చూపించి లైంగిదాడికి పాల్పడినట్టు ఆమె ఆరోపించింది. ఇప్పుడా వీడియో చిన్మయానంద పడక గదిలో లేదని హరిద్వార్ ఆశ్రమంలో దాచినట్టు పీజీ విద్యార్థిని వెల్లడించింది. మసాజ్ అన్నది నేరం కాదని, చాలా మంది స్పాకు వెళ్తుంటారని చిన్మయానంద తరఫున్యాయవాది ఓం సింగ్ అన్నారు.
ఇలా ఉండగా దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఎక్కడకూ వెళ్లొద్దని చిన్మయానందను సిట్ అధికారులు ఆదేశించారు.