జాతీయ వార్తలు

కేంద్రం ఆదేశిస్తే పీఓకేను తెచ్చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ను క్షణాల్లో స్వాధీనం చేసుకుని దేశంలో కలిపివేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన ప్రకటన చేశారు. జనరల్ బిపిన్ రావత్ గురువారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మరుక్షణం ఈ పనికి ఉపక్రమిస్తామని ఆయన స్పష్టం చేశారు. పీఓకేను పాకిస్తాన్ నుంచి విడిపించేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటమే ఆలస్యమని రావత్ అన్నారు. ‘ఇప్పుడు మిగిలిపోయిన పని పాకిస్తాన్ కబంధ హస్తాల నుండి పీఓకేను విడిపించటమే’అని ఆయన ప్రకటించారు. భారత దేశం తదుపరి అజెండా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను విడిపించుకోవటమేనని రావత్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అమలు చేసేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తమ తదుపరి అజెండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుని దేశంలో కలిపటమేనని ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి జితేందర్ సింగ్ జమ్మూలో జరిగిన పార్టీ కార్యక్రమంలో చెప్పారు. ‘పీఓకేను పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి విడిపించాలనేది మా ప్రభుత్వం, బీజేపీ నిర్ణయం కాదు. కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావుప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు. 1994లో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో చేసిన వాగ్దానం’అని జితేందర్ సింగ్ గుర్తుచేశారు. పాకిస్తాన్‌తో ఇక మీదట పిఓకే గురించి మాత్రమే చర్చలు జరుగుతాయని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించటం గమనార్హం.

*చిత్రం... ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్