జాతీయ వార్తలు

ఆమెది బాధ్యతారాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: యువత ఊబర్, ఓలా అద్దె వాహనాలను వాడేందుకు ఇష్టపడుతూ కార్లు కొనేందుకు సిద్ధపడకపోవటం వల్లే కార్ల పరిశ్రమలో మాంద్యం నెలకొన్నదంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను హస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై ఎందుకు ప్రకటన చేయటం లేదని బుధవారం ఆయన నిలదీశారు. మోదీ ఎందుకు ప్రజల ముందుకు రాకుండా అసమర్థ నిర్మలా సీతారాన్ వెనక దాగి ఉంటున్నారని సింఘ్వీ తీవ్ర ఆరోపణలు చేశారు. నిర్మలా సీతారామన్ ఆలోచించే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అని ఏఐసీసీలో జరిగిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి నరంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకుని నిర్మలా సీతారామన్ చేత దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని అభిషేక్ సింఘ్వీ డిమాండ్ చేశారు. యువత ఊబర్, ఓలా వాహనాలను ఉపయోగించటం వల్లనే కొత్త కార్ల విక్రయం పడిపోతోందంటూ దేశ ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతారహిత ప్రకటనలు చేయటం సమ్మతమేనా? అని ఆయన నరేంద్ర మోదీని ప్రశ్నించారు. 3ఊబర్, ఓలా సంస్థలు దేశంలో చాలా కాలం నుండి పని చేస్తున్నాయి. యువత ఎప్పటి నుండో వీటి సేవలను ఉపయోగించుకుంటోంది. యువత ఇప్పుడు కొత్తగా వీటి సేవలను ఉపయోగించకోవటం లేదు2అని కాంగ్రెస్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ రెండు అద్దె కార్ల సేవల మూలంగా కొత్త కార్ల విక్రయం పడిపోతోందని నిర్మలా సీతారామన్ చెప్పటం ఏమిటని అభిషేక్ సింఘ్వి నిలదీశారు. తెరమీదకు ఊబర్, ఓలా వ్యవహారం ఎలా ఊడిపడిందని ఆయన అడిగారు. ఊబర్, ఓలా మూలంగా కొత్త కార్ల ఉత్పత్తి 31 శాతం పడిపోతుందా? ఇది నిజమా? అంటూ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఊబర్, ఓలా అద్దె కార్ల సంస్థలకు ఇంత బలముందా? ఆయన అన్నారు.
నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక వ్యవహారాలు ఏమైనా అర్థం అవుతాయా? అంటూ ఆయన వ్యంగ్య బాణాలు విసిరారు. యువత, ఇతరులు అద్దె ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వటం వల్లనే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మాంద్యం నెలకొందా?అని సీతారామన్‌ను ఎద్దేవా చేశారు. దేశంలోని 30 నగరాల్లోని దాదాపు 30 లక్షల ఫ్లాట్లు అమ్ముడు కావటం లేదంటూ ఆర్థిక మంత్రి వాదన ప్రకారం యువత అద్దె ఇళ్లలో ఉండటం వల్లనే వాటిని కొనుగోలు కావటం లేదా?అని సింఘ్వీ వ్యంగ్య బాణాలు విసిరారు. పొదుపునకు అలవాటు పడిన వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేయటం వల్లనే ఆర్థిక రంగంలో సమతూకం నెలకొన్నదా? అంటూ అభిషేక్ ఆర్థిక మంత్రిని నిలదీశారు. క్రెడిట్ రేటింగ్ సంస్థలు భారత ఆర్థిక రంగం బాగా లేదంటూ చేస్తున్న ప్రకటనలు కూడా తప్పేనా? అని సంఘ్వీ ప్రశ్నించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరిగిపోవటానికి దేశంలోని ప్రైవేటు మనీ లెండర్లు కారణమా? అంటూ ఆర్థిక మంత్రిని ఉద్దేశించి అన్నారు. 3ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు అసమర్థ ఆర్థిక శాఖ మంత్రి వెనక దాగి ఉన్నారు? ఆర్థిక మాంద్యంపై ఎందుకు ప్రకటనలు చేయటం లేదు?. దేశ ప్రజలకు ఎందుకు ముఖం చాటేస్తున్నారు?2అని కాంగ్రెస్ ప్రతినిధి ప్రశ్నల వర్షం కురిపించారు.