జాతీయ వార్తలు

నెహ్రూ తప్పు.. పటేల్ ఒప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, సెప్టెంబర్ 11: దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత మొదటి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జవహార్‌లాల్ నెహ్రూ జమ్మూ-కాశ్మీర్ విషయంలో పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సరైన నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమెక్ట్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ) రెండో దఫా కేంద్రంలో అధికారాన్ని చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ సాధించిన ప్రగతి గురించి వివరించారు. జమ్మూ-కాశ్మీర్ సమస్యను పరిష్కరించే విషయంలో నాడు నెహ్రూ తప్పు చేశారని, హోం మంత్రిగా ఉన్న పటేల్ సరైన విధంగా స్పందించారని ఆయన తెలిపారు. నెహ్రూ రాజ్యాంగంలో 370-అధికరణ కింద జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించి ‘చారిత్రక తప్పిదం’ చేశారని ఆయన విమర్శించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ధైర్య, సాహసాలతో రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్, లడక్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించారన్నారు.