జాతీయ వార్తలు

సరికొత్త సహకార శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ఖాట్మండ్: భారత్-నేపాల్ మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల్లో సరికొత్త శకం ఆవిష్కృతమైంది. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ, ఖాట్మాండ్ నుంచి నేపాల్ ప్రధాని కేపీ ఓలీలు మంగళవారం దక్షిణాసియాలోనే మొట్టమొదటి సీమాంతర పెట్రోలియం పైపులైన్‌ను ప్రారంభించారు. దీనివల్ల తక్కువ వ్యయానికే తమ ఇంధన వనరులను తీర్చుకునే అవకాశం నేపాల్‌కు కలుగుతుంది. 69 కిలోమీటర్ల పొడవైన మోతీహరి-అమ్లేక్ గంజ్ అనే ఈ పైపులైన్‌ను వీడియో ద్వారా మోదీ, ఓలీ ప్రారంభించారు.
బీహార్‌లోని మోతీహరి నుంచి మొదలయ్యే ఈ పైపులైన్ నేపాల్‌లోని అమ్లేక్ గంజ్‌లో ముగుస్తుంది. ఈ పైపులైన్‌ను రికార్డు సమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించింది. ఇందుకు 324 కోట్ల రూపాయలు ఖర్చయింది. 2014లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఈ పైపులైన్ నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ ఇరుదేశాలు ఒప్పుకున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు అనుకున్న ప్రకారమే వేగంగా వెళ్తున్నాయని అన్నారు. రానున్న కొన్ని రోజుల్లోనే నేపాల్ ప్రధానితో కలసి ఈ ప్రాజెక్టులను ప్రారంభించగలనన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించామని, కానీ శంకుస్థాపన జరిగిన 15 నెలలకే ఇది పూర్తయిందని మోదీ వివరించారు. ప్రతియేటా ఈ పైపులైన్ ద్వారా నేపాల్‌కు 2 మిలియన్ మెట్రిక్ టన్నుల స్వచ్ఛమైన పెట్రోలు తక్కువ ధరకే నేపాల్‌కు చేరుతుందని తెలిపారు. ఈ విధంగా తమకు లభించిన ఆదాయాన్ని వినియోగదారులకే అందిస్తామని నేపాల్ ప్రధాని ఇప్పటికే హామీ ఇచ్చారని కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పైపులైన్ పూర్తకావడం నేపాల్‌కు గొప్ప విజయమని ఓలీ ఈ సందర్భంగా అన్నారు. ఇరు దేశాల అభివృద్ధి, సంపద, ఆనందం కోసం రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, ఇందుకోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రతిఒక్కరి సంక్షేమం కోసం పాటుపడతానన్న తన లక్ష్యానికి అనుగుణంగానే మోదీ ముందుకు సాగుతున్నారని, ఇది ఇరు దేశాల నిబద్ధతకు, సాన్నిహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఈ తాజా ప్రాజెక్టు వల్ల రెండు దేశాల మధ్య మరింతగా అనుసంధానం పెరుగుతుందని ఆయన తెలిపారు.
చిత్రం... నేపాల్ ప్రధాని ఓలితో కలిసి ఇరు దేశాల సంయుక్త పెట్రోలియం పైప్‌లైన్లను ప్రారంభిస్తున్న భారత్ ప్రధాని మోదీ