జాతీయ వార్తలు

గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణంతో మన దేశం గొప్ప ఆర్థిక సంస్కరణవాదిని, సమర్థ నాయకుడిని, మానవతావాదిని కోల్పోయిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఆయన అరుణ్ జైట్లీ భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. జైట్లీ మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమని అన్నారు. జైట్లీతో తనకు 25 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నది.. మంచి మనిషి, విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశ ఆర్థిక మంత్రి పదవికి ఎదిగిన సమర్థుడైన నాయకుడని చంద్రబాబు ప్రశంసలు కరిపించారు. ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్నేహితుడిని కోల్పోయిందని చంద్రబాబు వాపోయారు. అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని తెలిసిన తరువాత రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇప్పించిన వ్యక్తి అరుణ్ జైట్లీ అని ఆయన చెప్పారు.
తెలుగుదేశం లోక్‌సభ సభ్యులు కేశినేని నాని, గల్లా జయదేవ్, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్‌రావు కూడా అరుణ్ జైట్లీ భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు.
చిత్రం...ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు