జాతీయ వార్తలు

నక్సల్స్ పీడిత రాష్ట్రాలపై నేడు అమిత్ షా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: మావో ప్రభావిత రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం జరిగే ఒక కీలక సమావేశంలో హోం మంత్రి అమిత్ షా సమీక్షించబోతున్నారు. అదేవిధంగా నక్సల్స్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యల సాఫల్యతపై కూడా ఆయన ఈ సందర్భంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి 10 నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా వారి ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు, పౌర అధికారులు హాజరవుతారు. మూడు నెలల క్రితం హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన తర్వాత నక్సల్స్‌పై జరుగుతున్న కీలక సమావేశం ఇదే. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2009-13 మధ్య మొత్తం 8782 నక్సల్ దాడులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. 2014-18 నాటికి వీటి సంఖ్య దాదాపుగా 43.4 శాతం మేరకు పడిపోయిందని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2009-13 మధ్యకాలంలో నక్సల్స్ దాడుల్లో భద్రతా సిబ్బంది సహా 3326 మంది ప్రజలు చనిపోయారు. 2014-18 మధ్యకాలంలో ఈ మరణాల సంఖ్య 60.4 శాతం మేర తగ్గిపోయిందని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో నక్సల్స్ హింసకు సంబంధించి 310 సంఘటనలు జరిగాయి. వాటిలో 88 మంది మరణించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన విధానం కారణంగానే వామపక్ష ఉగ్రవాదం అదుపులోకి వచ్చిందని, దాని భౌగోళిక విస్తరణ కూడా క్రమంగా తగ్గుతోందని హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి గత నెలలో వెల్లడించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.