జాతీయ వార్తలు

ప్రింట్ మీడియా ప్రభావం అపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 25: పాఠకులపై ప్రింట్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేటపుడు గరిష్ఠస్థాయిలో అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా సామాజిక మాధ్యమాల్లో కథనాలను ప్రచురించడం వల్ల ఎన్నో విపత్కర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన మీడియా అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మాట్లాడిన ముఖర్జీ గతంలో సామాజిక మీడియా కథనాల వల్లే ఎన్నో ఉద్రిక్తతలు, మత ఘర్షణలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అమాయకంగా ఈ రకమైన వార్తలను పోస్టు చేసినవారు కూడా ఇందుకు బాధ్యులవుతారని ఆయన తెలిపారు. ప్రింట్ మీడియాపై తనకు అపారమైన విశ్వాసం, నమ్మకం ఉన్నాయని వెల్లడించిన ముఖర్జీ ‘పత్రికల్లో నేను ఏ వార్త చదివినా దానిని నేను నమ్ముతాను. ఎందుకంటే ప్రచురితమైన వార్త వాస్తవికతను నిర్ధారించుకున్న తర్వాతే దానిని ప్రచురించారని భావిస్తాను’ అని అన్నారు. అయితే, సామాజిక మాధ్యమాల్లో ఇలా వార్తా కథనాల వాస్తవికతను నిర్ధారించుకునే పరిస్థితి ఉండదని, ఒకవేళ అవి తప్పుడు కథనాలు అయితే అవి సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంటుందని ఆయన అన్నారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో సమాచారాన్ని పంచుకునే విషయంలో ప్రతీ ఒక్కరూ అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని ఆయన అన్నారు. ఒకప్పుడు వార్త వ్యాప్తి పరిధి చాలా తక్కువగానే ఉండేదని, మొదట కాగితాలపై రాయడం, ఆ తర్వాత టైప్ రైటర్లు రావడం, ఇపు డు మొబైల్ ఫోనే్ల అన్నింటికీ వేదికగా మారాయని, మాధ్యమం ఏదైనా ఈ కథనాల నిజాయితీ, సహేతుకత విషయంలో రాజీ పడకూడదని ఆయన అన్నారు. పాత్రికేయులకు భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ వ్యక్తిగా సంపాదకీయాల్లో దీనిని వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ వార్తల విషయం లో మాత్రం ఈ నిజాయితీని పాటించాలని, నిష్పాక్షికంగా వ్యవహరించాలని ముఖర్జీ తెలిపారు. ప్రజాస్వామిక హక్కుల సాధనలోను, సిద్ధాంతాల వ్యాప్తిలోనూ మీడియా నిర్వహించే పాత్ర అపారమని పేర్కొన్న ముఖర్జీ ఎంతగా అధికారం చేతులో ఉంటే అంతగానూ బాధ్యత ఉంటుందని తెలిపారు. పశ్చిమబెంగాల్‌ను భారతీయ జర్నలిజానికా కాణాచిగా అభివర్ణించిన ఆయన 1780 లోనే మొదటి భారతీయ పత్రిక ‘హిక్కీస్ బెంగాల్ గెజిట్’ ఇక్కడ నుంచి ప్రచురితమైందని ఆయన అన్నారు. స్వాతంత్య్రోద్యమంలోనూ సామాజిక, సాంస్కృతిక వికాసంలోనూ పాత్రికేయ వృత్తి ప్రశంసనీయ భూమికను పోషించిందని ఆయన అన్నారు.

చిత్రం...మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ