జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో అధికార దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: జమ్మూకాశ్మీర్ ప్రజలపై ఎంతగా అధికార దుర్వినియోగం జరుగుతోందో అక్కడి పాలనా వ్యవస్థ ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో ప్రతిపక్ష పార్టీలకు, మీడియాకు స్పష్టమైందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. శ్రీనగర్‌లో పర్యటించాలన్న ఈ బృందాన్ని వెనక్కి పంపించాలన్న విషయాన్ని చూస్తే ఎంత రాక్షసంగా అధికారం అమలవుతోందో తమ కళ్లకు కట్టిందని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాహుల్ సహా పలు పార్టీలకు చెందిన నేతలను శ్రీనగర్‌లో దిగిన వెంటనే అక్కడి ప్రభుత్వం ముందుకెళ్లకుండా కట్టడి చేసింది. అనంతరం వారిని వెనక్కి పంపేసింది. గత 20 రోజులుగా కాశ్మీర్ ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ లేదని, వారి పౌరహక్కులు హరించుకుపోతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. శనివారంనాడు సంఘటనల వీడియోలను కూడా ఆయన పోస్టు చేశారు. ప్రభుత్వ యంత్రాంగ ఉత్తర్వును ప్రతిపక్ష నేతలకు అధికారులు చదివి వినిపిస్తున్న దృశ్యం, అలాగే రాహుల్ మాట్లాడుతున్న వివరాలు ఇందులో ఉన్నాయి. ప్రతిపక్షాల బృందంతో వచ్చిన మీడియా సభ్యులపై కూడా అక్కడి అధికారులు దురుసుగా ప్రవర్తించారని, కొట్టారని కూడా రాహుల్ గాంధీ అన్నట్టుగా అందులో ఉంది. దీనిని బట్టి చూస్తే కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేవన్న విషయం స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.