జాతీయ వార్తలు

విలువలు మేళవించిన విజ్ఞాన సౌధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైట్లీ..దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో మార్మోగిన మేరు. మేథస్సు, దక్షత, పాలనా పటిమ,వాగ్దాటి..ఈ నాలుగు నిరుపమాన లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం అత్యంత అరుదే..వీటిని పుణికి పుచ్చుకున్న జైట్లీ భిన్నరంగాల్లో విశేషంగా రాణించారు. అశేషమైన ఖ్యాతినార్జించారు. న్యాయవాదిగా, ఆర్థిక మంత్రిగా, రక్షణ మంత్రిగా జైట్లీకి ఏ పదవైనా సంస్కరణలకు వేదక అయింది. జనధన్ ద్వారా బ్యాంకులను గ్రామాల బాట పట్టించారు. జీఎస్టీ ద్వారా పన్నుల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. తమ వాక్పటిమతో, మేథస్సుతో బీజేపీని అనూహ్యమైన రాజకీయ పుంతలు తొక్కించారు. దేశ చరిత్రలో తనదైన ముద్ర వేసిన జైట్లీ జనధన యోధుడిగా జనం గుండెల్లో తరగని యశస్సు సంపాదించుకున్నారు. అజాత శత్రువన్న మాటకు అక్షరాల సరిపోయే నిండైన, నిరుపమానమైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన వ్యక్తిత్వం ఎంత ఉన్నతమో..రాజకీయ జీవితమూ అంతగానూ నిరుపమానం. రాజకీయాలకు అతీతంగా ఆయన రాణించారు. ఎమర్జెన్సీ కాలంలో యంగ్‌టర్క్‌గా మొదలైన జైట్లీ రాజకీయ జీవితం విలువలు మేళవించిన విజ్ఞాన సౌధం.