జాతీయ వార్తలు

ఆకాశరామన్న ఉత్తరాలపై స్పందించడం బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ తీరును తప్పుపడుతూ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్‌ను టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా నియమించడం తెలిసిందే. శ్రీవారి ఆలయంలో నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం విచారణ ప్రారంభించారు. దీనిపై టీటీడీ వైఖరికి ప్రవీణ్ ప్రకాష్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈవో అనిల్ సింఘాల్‌కు రెండు పేజీల లేఖ రాశారు. నిధుల గోల్‌మాల్ ఆరోపణలు రావడంతో డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి చేత విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. అయితే ఈ సమయంలో టీటీడీ మాత్రం ఎస్సై స్థాయి అధికారిని విచారణకు ఆదేశించడం ఏమిటని ఆయన లేఖలో ప్రశ్నించారు. టీటీడీ వైఖరి ఏపీ భవన్ విలువను తగ్గించేలా వుందని పేర్కొరు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీంటిపై టీటీడీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా విచారణ ఆగలేదన్నారు. బ్రహ్మోత్సవాల పేరుతో చందాలు స్వీకరిస్తున్నారని, స్వామివారి రోజువారీ పూజలకు అవసరమైన పూలు, ఇతర వస్తువుల సరఫరా కాంట్రాక్టర్ల నుంచి అధికారులు ముడుపులు తీసుకుటున్నారని, ప్రత్యేక పూజలు, పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాల్లోనూ అక్రమాలకు పాల్పడుతూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఒక భక్తుడు టీటీడీకి ఫిర్యాదు చేశారు. ఏపీ భవన్ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ అవకతవకలు జరిగినట్టు టీటీడీ ఈవో, జేఈవో చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.