జాతీయ వార్తలు

వచ్చే ఏడాదీ నీట్ ఆఫ్‌లైన్‌లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్, ఆయుష్ కాలేజీల్లో యూజీ ప్రోగ్రాంలో అడ్మిషన్లకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు(నీట్-2020)ని ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్ణయించింది. గత ఏడాది ఈ పరీక్షకు 15,19,375 మంది దరఖాస్తు చేయగా, 14,10,755 మంది పరీక్షకు హాజరయ్యారు. 1884 మంది ఎన్‌ఆర్‌ఐలు, 675 మంది ఒసీఐలు, 63 మంది పీఐఓలు కూడా హాజరయ్యారు. వచ్చే ఏడాది ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది నీట్ -యూజీ -2020ని మే 3వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ చివరి వారంలో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 2వ తేదీ నుండి 31వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్‌కు
అవకాశం ఇస్తారు. అడ్మిట్ కార్డులను మార్చి 27న జారీ చేస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు. అదే నెల మూడోవారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జూలై 15 నాటికి అడ్మిషన్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ఏజన్సీలు పనిచేస్తున్నాయి. గత ఏడాది నీట్‌ను మే 5న నిర్వహించగా, వరదల కారణంగా మరికొన్ని ప్రాంతాల్లో మే 20న నిర్వహించింది. దేశవ్యాప్తంగా 154 పట్టణాల్లో 11 భాషల్లో 2546 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించింది. ఇందుకోసం అన్ని పరీక్ష కేంద్రాల్లో కలిపి 64వేల పరీక్ష గదులను ఏర్పాటు చేశారు. పరీక్ష ఇన్విజిలేటర్లుగా 1,28,000 మందిని నియమించగా, ఆరు వేల మందిని ఎన్‌టీఏ ప్రతినిధులుగా, మరవో 163 మందిని సిటీ కోఆర్డినేటర్లుగా నియమించారు. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోననే ఆందోళనతో ఎన్‌టీఏ ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించనుంది. పార్లమెంటు చట్టం ప్రకారం నిర్వహిస్తున్న జిప్‌మర్, ఎయిమ్స్‌లకు వేరుగానే పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు సంస్థల అడ్మిషన్లను సైతం ఎన్‌టీఏకే అప్పగించాలని తొలుత భావించినా, ఇంకా వ్యవహారం కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వ చొరవతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది.