జాతీయ వార్తలు

మార్పులకు కొత్త అర్థం మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: పరివర్తనా వ్యాకరణాన్ని వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తిరిగి రాసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీనేనని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ ఆరేళ్లకాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, విధానాలు ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయని, అలాగే అంతర్జాతీయంగా కూడా భారత వృద్ధికి బలమైన ఊతాన్ని ఇచ్చాయని అమిత్ షా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎనిమిదిసార్లు అధికారాన్ని చేపట్టిందని, ఇనే్నళ్ల పాలనలో పరివర్తనాత్మక మార్పులకు సంబంధించిన పది చర్యలను కూడా ఆ పార్టీ తీసుకోలేకపోయిందని ఆయన అన్నారు. వ్యాపారవర్గాల సారథ్యం లేకపోతే భారతదేశం ముందుకు సాగదన్న వాస్తవాన్ని మోదీ గుర్తించారని, అందుకే ఈ రంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ వచ్చారని ఓ వ్యాసంలో అమిత్ షా పేర్కొన్నారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370 రాజ్యాంగ అధికరణ, అలాగే 35-ఏ అధికరణ రద్దును అమిత్ షా ప్రస్తావించారు. ఈ నిర్ణయం మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధిని, పట్టుదలను చాటిచెప్పిందని ఆయన అన్నారు. అలాగే, ఈ నిర్ణయానికి పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం లభించడం కూడా ఒకే దేశం..ఒకే రాజ్యాంగం అన్న ఆయన ఆశయానికి అద్దం పట్టేదని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం వల్ల జమ్మూకాశ్మీర్‌లో సరికొత్త అభివృద్ధి శకం ఆవిష్కృతమవుతుందని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, త్రిపుల్ తలాక్‌కు చరమగీతం పాడడం, ఆక్రమిత కాశ్మీర్‌పై లక్షిత దాడులు, ఒకే ర్యాంక్.. ఒకే పెన్షన్ వంటి నిర్ణయాల జోలికి ఏ ప్రభుత్వాలు పోలేదని, కానీ మోదీ మాత్రం వాటిని ఆచరించి చూపించారని అమిత్ షా పేర్కొన్నారు.
అలాగే మోదీ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన ఆయన ‘మోదీ లాంటి దృఢచిత్తం కలిగిన నాయకుడు ఇంతవరకు భారత్ చూడలేదన్న విషయాన్ని ఈ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి’ అని అమిత్ షా పేర్కొన్నారు. కాగా, ఈ నిర్ణయాలన్ని కూడా ప్రజామోదంతోనే జరుగుతున్నాయన్నది వాస్తవమేనని, అందుకు కారణం మోదీకున్న తిరుగులేని జనాకర్షక శక్తేనని ఆయన అన్నారు.