జాతీయ వార్తలు

రాజ్యసభ సభ్యునిగా మన్మోహన్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 23: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌లోని రాజ్యసభ చైర్మ న్ వెంకయ్యనాయుడు కార్యాలయంలో ఆయన మన్మోహన్‌సింగ్ చేత ప్రమాణ చేయించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ పక్ష నాయకుడు థావర్ చంద్ గెహ్లాట్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఆ పార్టీ రాజ్యసభ పక్ష నాయకుడు గులామ్ నబీ అజాద్ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. మన్మోహన్‌సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. మిగతా పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును రాజ్యసభకు ప్రతిపాదించగా బీజేపీ ఎవరినీ బరిలోకి దింపలేదు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు మదన్‌లాల్ సైనీ ఇటీవల అకాల మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 1991 నుంచి అసోం నుంచి మన్మోహన్ పెద్దల సభకు ప్రతినిద్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది జూన్ 14తో ముగిసింది. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఈ సారి మన్మోహన్ సింగ్‌ను రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిపింది. మన్మోహన్‌సింగ్ 2024 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారు.