జాతీయ వార్తలు

ఎస్పీ కార్యవర్గాల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 23: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలని పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని భావించారు. 2022లో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలతో పాటు యువజన విభాగాలను సైతం రద్దు చేశారని పేరు చెప్పడానికి అంగీకరించని ఓ సీనియర్ పార్టీ నాయకుడు స్పష్టం చేశారు. త్వరలోనే ఈమేరకు కొత్త కార్యవర్గాలను అధ్యక్షుడు అఖిలేష్ నియమిస్తారని ఆయన వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి కేవలం ఐదు స్థానాలను మాత్రమే కైవసం చేసుకోవడంపై అఖిలేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆర్‌ఎల్‌డీతో పొత్తుపెట్టుకొన్న బీఎస్పీ సైతం పది స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సిట్టింగ్ పార్లమెంట్ స్థానమైన కనౌజ్‌లో సైతం ఓటమి చెందడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. పార్టీ పరిస్థితి ఎందుకిలా అవుతోందన్న అంశంపై దృష్టిసారించారు. ఈమేరకు గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని వర్గాలను కలుసుకొని వివరాలు సేకరించారు. అంతర్మథనం అనంతరం పార్టీ కార్యవర్గాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప 2022లో యూపీలో పూర్వవైభవం సాధ్యం కాదని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పార్టీకి సంబంధించిన అన్ని కార్యవర్గాలను రద్దు చేశారని పార్టీ సీనియర్ నాయకుడు తెలిపారు. ఇదిలా ఉంటే.. 2017లో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ములాయం సింగ్ యాదవ్ మాటలను లెక్క చేయకుండా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పరాజయాన్ని చవిచూశారు. ఆమేరకు యూపీ ప్రభుత్వ పగ్గాలు యోగి ఆదిత్యనాథ్ చేతిలోకి వెళ్లిపోయాయి. అలాగే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు అంశంలో సైతం తండ్రి మాటను వినకుండా ఏకపక్షంగా బరిలో నిలవడంతో మరోసారి అఖిలేష్ కంగు తినకతప్పలేదు. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా కేవలం ఐదు సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావడాన్ని అఖిలేష్ జీర్ణించుకోలేక పోయారు. ఇక పార్టీని సమూలంగా పక్షాళన చేస్తే తప్ప పూర్వవైభవం సాధ్యం కాదని గ్రహించారు. ఈమేరకు పార్టీకి సంబంధించిన అన్ని కార్యవర్గాలను అఖిలేష్ రద్దు చేసి సంస్కరణలపై దృష్టిసారించారు.