జాతీయ వార్తలు

ఏకపక్ష నిర్ణయాలతోనే కుప్పకూలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 23: కర్నాటకలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి తానే బాధ్యత వహించాలని జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ చేసిన ఆరోపణలను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య తీవ్రంగా ఖండించారు. ‘కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్యను సంప్రదించకుండా కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడాన్ని సిద్దరామయ్య జీర్ణించుకోలేక పోయారని’ దేవెగౌడ గురువారం వ్యాఖ్యానించడాన్ని సిద్దరామయ్య తప్పుబట్టారు. శుక్రవారం ఇక్కడ సిద్దరామయ్య విలేఖరులతో మాట్లాడుతూ కేవలం ఏకపక్ష విధానాల కారణంగానే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిందని.. చివరి క్షణం ప్రభుత్వాన్ని కాపాడేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలను చేశాననీ.. అయినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొన్నారు. దేవెగౌడ తనపై చేసిన ఆరోపణలు ‘పూర్తిగా సత్యదూరం.. నిరాధారం.. రాజకీయ దురుద్దేశంతో కూడినదేనని’ సిద్దరామయ్య వివరణ ఇచ్చారు. గత నెలలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు కుమారస్వామి ఇద్దరూ కారణమేనని.. ఆ ప్రభుత్వంలో తాను ఎక్కడైనా జోక్యం చేసుకొన్నానన్న ఆరోపణలను నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ‘బీజేపీ అధికారంలోకి రావడాన్ని నేనెప్పుడూ కోరుకోలేదు.. 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు ఉన్నప్పటికీ పార్టీ అధిష్ఠానం 37మంది ఎమ్మెల్యేలున్న జేడీఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు’ అని సిద్దరామయ్య స్పష్టం చేశారు. దేవెగౌడతోపాటు కుమారస్వామి, ఆయన మరో కుమారుడు, మంత్రి అయిన హెచ్‌డీ రేవన్నలే ప్రభుత్వం కుప్పకూలడానికి బాధ్యులని సిద్దరామయ్య పేర్కొన్నారు. ఈ ముగ్గురి త్రయం కలిసి ఏకపక్ష నిర్ణయాలను తీసుకొంటూ పోయిందని చెప్పారు. ఏనాడూ ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులను విశ్వాసం లోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే కర్నాటకలో ఈ పరిస్థితి దాపురించడానికి కారణమని సిద్దరామయ్య స్పష్టం చేశారు.