జాతీయ వార్తలు

చంద్రయాన్ నుంచి చంద్రుడు ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 22: భారతీయులు తీయని స్వప్నంగా చెప్పుకొనే చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రుని కక్ష్యలోకి వెళ్లినంతరం తన కర్తవ్య బాధ్యతను ప్రారంభించింది. భూకక్ష్యలో నుంచి ఈ నెల రెండు రోజుల క్రితం ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేరిన మాడ్యూల్ చంద్ర మండలంలో తిరుగుతూ చంద్రుని ఛాయా చిత్రాలు తీసి పంపింది. ఈ ఛాయా చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం రాత్రి విడుదల చేసింది. భూకక్ష్యలో పయనిస్తుప్పుడు కూడా ఈ నెల 4న భూ భాగాన్ని అందంగా చిత్రీకరించి పంపిన విషయం తెలిసిందే. భాతర అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ జూలై 22న జీ ఎస్ ఎల్‌వీ- మార్క్ 3 ఎం 1 వాహక నౌక ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహంలో అర్బిటర్, రోవర్, ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్‌లను అంతరిక్షంలోకి పంపారు. విజయవంతంగా కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2 తన గమ్యాన్ని చేరుకొనేందుకు పయనాన్ని
సాగించింది. రోదసీలో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చినంతరం రాకెట్ నుంచి విడిపోయింది. అనంతరం ఉపగ్రహంలో ఉండే ఇంధనాన్ని మండిస్తూ బెంగుళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి దశల వారీగా ఉపగ్రహ కక్ష్యను శాస్తవ్రేత్తలు విజయవంతంగా పెంచుతూ జాబిల్లి వైపు వెళ్లే విధంగా చేశారు. ఆగస్టు 6న నిర్ణీత ఎత్తులోకి చేరిన చంద్రయాన్-2 అందులో పొందుపరిచిన అత్యాధునిక కెమెరాలు తమ పనిని ప్రారంభించాయి. మాడ్యూల్‌లో కీలకమైన రోవర్, ల్యాండర్‌లోని పేలోడ్ల సాయంతో మన శాస్తవ్రేత్తలు మరోసారి క్లిక్‌మనించారు. ఈ నెల 20న భూకక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-2 ఒక రోజులోనే అనగా బుధవారం రాత్రి 7:03గంటలకు జాబిల్లి కక్ష్యలో తిరుగుతూ 2650కిలో మీటర్ల ఎత్తునుంచి చంద్రుని ఛాయా చిత్రాన్ని తీసింది. ల్యాండర్‌లో పొందుపరిచిన ఎల్ 14కెమెరా ద్వారా చిత్రాలను అందుకొన్న ఇస్రో దేశ ప్రజలకు చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలో తీసిన చాయా చిత్రాలను విడుదల చేసి కానుకగా అందించింది. చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న మాడ్యూల్ సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలం పై దిగి పరిశోధనలు ప్రారంభించనుంది. ఇప్పటికే భూకక్ష్యలో చంద్రయాన్-2 తన పనిని తాను పూర్తిచేసుకొని విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించి తన కర్తవ్యాన్ని పూర్తిచేయడంతో ఇస్రో శాస్తవ్రేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన 24గంటల లోపే తన పనిని తానుచేసుకొంటూ చంద్రుని ఛాయా చిత్రాలు తీసి శాస్తవ్రేత్తలు అనుకొన్న విధంగా చంద్రయాన్-2 పయనం చంద్రుడి కక్ష్యలో కూడా విజయవంతంగా చేస్తోంది. ఇక చివరి ఘట్టం సెస్టెంబర్ 7న చంద్రుని పై రోవర్ దిగి పరిశోధనలు ప్రారంభిచడమే.

చిత్రం...చంద్రయాన్-2 పంపిన ఛాయాచిత్రం