జాతీయ వార్తలు

వరద బాధితులకు ఆపన్న హస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 21: మహారాష్టల్రో భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల వల్ల నిరాశ్రయులయిన వారిని ఆదుకునేందుకు అనేక మంది సెలబ్రిటీలు ముందుకొచ్చారు. బ్యాంకులు, వాణిజ్య సంస్థలు కూడా తమ ఆపన్న హస్తాన్ని అందించి, ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశాయి. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మంగళవారం రూ. 11లక్షలు విరాళమివ్వగా, సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రూ. 25లక్షలు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్టల్రో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25లక్షలు అందజేసిన అమీర్ ఖాన్‌కు కృతజ్ఞతలు అని ఫడ్నవిస్ పేర్కొన్నారు. సీఎం సహాయ నిధికి రూ. 11లక్షలు అందజేసిన గౌరవనీయులయిన లతా దీదీకి కూడా కృతజ్ఞతలు అని ఫడ్నవిస్ మరో ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. వీరితో పాటు మహారాష్ట్ర ఇండస్ట్రియిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ. ఒక కోటి, కొల్హాపూర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రూ. 21.98 లక్షలు, బుల్దానాలోని హజ్త్ హజి అబ్దుల్ రెహమాన్ సైలాని హహ్‌బాబా ట్రస్టు రూ. అయిదు లక్షలు, పుణేలోని ఆర్గనైజేషన్ ఆఫ్ సిటిజెన్స్ రూ. ఏడు లక్షలు సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చాయి.