జాతీయ వార్తలు

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: వాల్తేరు రైల్వే డివిజన్ విభజించకుండా విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కొస్తారైల్వే జోన్‌లోనే ఉంచాలని కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్‌కు వైసీపీఎ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రిని కలిసింది. సమావేశానంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలను గోయల్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. విశాఖ కేంద్రంగా నూతనంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్ ఉంచాలని కోరామన్నారు. వాల్తేరు డివిజన్ విభజనకు వైసీపీ వ్యతిరేకమని, ఇదే విషయాన్ని మంత్రికి చెప్పామని ఆయన పేర్కొన్నారు. వాల్తేరు డివిజన్ నుంచి ఏఏ ప్రాంతాలను రాయగఢ్ డివిజన్‌లోకి చేరుస్తున్నారో, వాటిని అలాగే ఉంచి వాల్తేరు డివిజన్‌లోనే కొనసాగించాలని విజయసాయి చెప్పారు. వాల్తేరు డివిజన్‌ను అలాగే ఉంచి విశాఖ కేంద్రంగా జోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ఇచ్చాపురం, పలాస ప్రాంతాలను రాయగఢ్ డివిజన్‌లో చేర్చాలని గతంలో నిర్ణయించారు. కాగా ఈ ప్రాంతాలను వాల్తేరు డివిజన్‌లోనే ఉంచాలని గతంలోనే ప్రధాని, హోమంత్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కోరారని, అదే విషయాన్ని రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఆయన అన్నారు. కొత్త రైల్వేజోన్ పరిధిని ఈనెల 31లోగా నిర్ణయించనున్నారని, గడువును పెంచి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న విజ్ఞప్తి పరిశీలించాలని పియూష్ గోయల్‌ను వారు కోరారు. దీనిపై కేంద్రమంత్రి సానుకులంగా స్పందించారని ఆయన విజయసాయిరెడ్డి వెల్లడించారు. అలాగే నెల్లూరు జిల్లాలోని బిట్రగుంటలో కాంక్రిట్ స్లిపర్ కర్మాగారం లేదా ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతపురం జిల్లాలో రైల్వేల అభివృద్ధి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ను త్వరగా పూర్తి చేయాలని మంత్రిని అభ్యర్థించారు.
ఏపీతో స్నేహ పూర్వకమైన ప్రభుత్వం వుంది: గోయల్
ఆంధ్రప్రదేశ్‌లో తమకు స్నేహ పూర్వకమైన ప్రభుత్వం వుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులపై వైసీపీ ఎంపీల బృందం కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, అలాగే కొత్త రైల్వేజోన్ అంశాలపైనా ఎంపీలతో నాతో చర్చించారు’అని అన్నారు. రైల్వేల అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడుతునే జాతీయ స్థాయిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ మెజారిటీతో వైసీపీకి అధికారం అప్పగించారని ఆయన తెలిపారు. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని గోయల్ ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి వుందని స్పష్టం చేశారు. మరింత వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తుందని పియూష్ గోయల్ వెల్లడించారు.
అరకు పర్యాటకులకు మరో అద్దాల బోగీ
అరకు అందాలను వీక్షించేందుకు విశాఖపట్నం నుంచి రైలు మార్గంలో వెళ్లే పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు మరొక అద్దాల బోగీని ఏర్పాటు చేయ్యనున్నట్టు కేంద్రమంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంలో విజయసాయిరెడ్డి, ఎంపీ మాధవి పరిచయం చేశారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ఇప్పటికే ఈ కోచ్ తయారైందని వైసీపీ ఎంపీలకు మంత్రి చెప్పారు. దీంతో విస్టాడోమ్ కోచ్‌ల సంఖ్య రెండుకు చేరుకుంటాయి.
చిత్రం... కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు పథకాల గురించి వివరిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి