జాతీయ వార్తలు

‘కాశ్మీర్’పై జనంలోకి బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ఔచిత్యంపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని బీజేపీ సంకల్పిస్తోంది. 370 రాజ్యాంగ అధికరణను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరించేందుకు సినిమా, క్రీడలు, విద్యా రంగం సహా వివిధ రంగాలకు చెందిన 2,000 మంది ప్రముఖులను రంగంలోకి దింపబోతోంది. ఈ అంశంపై ప్రజా చైతన్య ప్రచారాన్ని మొదలుపెట్టామని, రాష్ట్ర, జిల్లా స్థాయిలో దేశవ్యాప్తం ఈ ప్రక్రియ సాగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఈ భావోద్వేగ అంశాన్ని సజీవంగా ఉంచాలన్న దృక్పథంతోనే దీనిపై ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలుస్తోంది. 370 అధికరణ రద్దుకు ప్రజామోదం ఉందని భావిస్తున్న బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీనిద్వారా పూర్తిస్థాయి రాజకీయ లబ్ధిని పొందాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, ఈ అంశంపై ప్రతిపక్ష దుష్టచ్రారాన్ని ఎలా తిప్పికొట్టాలన్న దానిపై కూడా బీజేపీ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా 370 ప్రాంతాల్లో ఈ సమావేశాలు నిర్వహించాలని, జిల్లా స్థాయిలో 500 నుంచి 1000 మంది వరకు నిపుణులకూ ఈ ప్రచారంలో ప్రమేయం కల్పించాలని బీజేపీ యోచిస్తోంది. దాదాపు 2000 మంది హాజరయ్యే పెద్ద సభలకు 35 మంది వరకు నిపుణులను తరలించాలని అన్ని రాష్ట్రాల రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సమాశాలు జరుగుతాయని బీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు. రాష్టస్థ్రాయి జరిగే ఈ రకమైన సమావేశాల్లో కొన్నింటిలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే, ఈ ప్రచారంలో పాల్గొనేలా 2000 మంది ప్రముఖులను సంప్రదించే అంశంపైనా బీజేపీ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన జాబితాను రూపొందిస్తున్నామని, 370 అధికరణపై ప్రచారం ఎలా ఉండాలన్న దానిపైనా ఒక కమిటీని నియమించినట్టు చెబుతున్నారు. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్, జితేందర్ సింగ్ తదితరులు ఉంటారు.