జాతీయ వార్తలు

బీసీల సమస్యలను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశ వ్యాప్తంగా అత్యధికంగా ఉన్న ఓబీసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఓబీసీల హక్కులపై వెనకబడిన వర్గాలు సాధికారిత సంఘం, అఖిల భారత వెనకబడిన వర్గాల అభ్యున్నతిపై ఢిల్లీలో సామాజిక న్యాయం-సమానత్వం అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ శరద్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగానికి కట్టుబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీల హక్కులను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. గడచిన ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఓబీసీలను చిన్నచూపుచూస్తునే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓబీసీల హక్కుల కోసం కలిసిగట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఓబీసీలను ఏకం చేసేందుకు ఈ రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ సదస్సులో చర్చించిన అంశాలు మెజార్టీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని మోదీల దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ప్రొ తిరుమలి, మాజీ న్యాయమూర్తులు ఈశ్వరయ్య, ఎంఎన్ రావు, రామలింగేశ్వర్‌రావు వివిధ రాష్ట్రాల ఓబీసీ నాయకులు పాల్గొన్నారు.