జాతీయ వార్తలు

యోగి కేబినెట్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 21: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 18 మంది కొత్త మంత్రులకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయిన తరవాత మంత్రి వర్గాన్ని విస్తరించడం ఇదే మొదటి సారి. 23 మంది మంత్రుల్లో 18 కొత్తముఖాలే. పాత వారికి ఐదుగురికి పదోన్నతి లభించింది. లక్నోలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులకు తరువాత శాఖలు కేటాయిస్తారు. 23 మందిలో ఆరుగురు కేబినెట్, ఆరుగురు స్వతంత్ర, 11 మంది సహాయ మంత్రులుగా ఉంటారు. కొత్త ముఖాలైన రాంనరేష్ అగ్నిహోత్రి, కమల్ రాణి వరుణ్ కేబినెట్ ర్యాంక్ దక్కింది. బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్(ఎస్)కు విస్తరణలో ప్రాతినిధ్యం కల్పించలేదు. ఎన్‌డీఏలో భాగస్వామి అయిన అప్నాదళ్‌కు అసెంబ్లీలో ఎనిమిది మంది, మండలిలో ఒక సభ్యుడు ఉన్నారు. అందులో జైకుమార్ సింగ్ ఒక్కరే సహాయ మంత్రిగా ఉన్నాడు. కాగా మహేంద్ర సింగ్, సురేష్ రాణా, భూపేంద్ర సిగ్ చౌదరీ, అనిల్ రాజ్‌భర్‌కు కేబినెట్ మంత్రులుగా పదోన్నతి దక్కింది. లోక్‌సభ ఎన్నికల్లో అస్సాం రాష్ట్ర బీజేపీ వ్యవహారా ఇన్‌చార్జిగా సమర్ధవంతంగా పనిచేసిన మహేంద్ర సింగ్‌కు పదోన్నతి లభించింది. ఇక సురేష్ రాణా విషయానికి వస్తే ఆయన కరుడుగట్టిన హిందుత్వవాది. రాణా పశ్చిమ యూపీకి చెందినవారు. బీజేపీ సీనియర్ నేత, భోగావ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలిచిన నరేష్ అగ్నిహోత్రికి విస్తరణలో స్థానం కల్పించారు. ఆయనకు కేబినెట్ ర్యాంక్ దక్కింది. మైన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిదే భోగావ్. మైన్‌పురి ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట. అగ్నిహోత్రి 1980 నుంచి బీజేపీలోనే ఉన్నారు. గతంలో విధాన మండలి సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుత కేబినెట్‌లో కమల్ రాణి వరుణ్ ఏకైక మహిళా మంత్రి. ఘటమ్‌పూర్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఆమె కాన్పూర్ ఎంపీగా పనిచేశారు. రీణా బహుగుణ జోషీ లోక్‌సభకు ఎన్నికైనందున మంత్రి పదవికి ఆమె రాజీనామా చేశారు. ఆమె స్థానంలో కమల్‌ను తీసుకున్నారు. అలాగే నీలకంఠ్ తివారీని సహాయ మంత్రిగా స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆయన సమాచార మంత్రిగా పనిచేశారు.
ఆయన వారణాసి దక్షిణ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేబినెట్ కూర్పుపై మంగళవారం యోగి ఆదిత్యనాథ్ తీవ్రమైన కసరత్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సీనియర్లకు చోటు కల్పించడం ద్వారా 2022 ఎన్నికలకు వెళ్లాలని భావించారు. అలాగే విస్తరణ జరిగింది. రవీంద్ర జైస్వాల్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆయన మద్దతుదారులు హరహర మహాదేవా అంటూ నినాదాలు చేశారు.

చిత్రం... లక్నోలో ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.