జాతీయ వార్తలు

న్యాయ చైతన్యమే హక్కులకు రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్ : జన బాహుళ్య హక్కులు హరించుకుని పోవడానికి, వారికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కక పోవడానికి ప్రధాన కారణం న్యాయపరమైన అవగాహన లేకపోవడమేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ప్రజలు దోపిడీకి గురి కావడానికి, మోసాలకు లోనుకావడానికి కూడా ఈ న్యాయ అవగాహన రాహిత్యమే మూలమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ హక్కుల గురించి తెలుసుకోవడం, వాటిని సాధించుకోవడం అన్నది అత్యంత శక్తివంతమైన ఆయుధాలు అవుతాయని ఆయన పేర్కొన్నారు.
న్యాయ సేవల అథారిటీ 17వ జాతీయ సదస్సు ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ఆదివారం ఇక్కడ మాట్లాడారు. పేదలు సామాజిక న్యాయం, ఇతరత్రా దోపిడీకి గురి కాకుండా ఉండేందుకు, అలాగే సంక్షేమ ప్రయోజనాలు వారికి అందేలా చూసేందుకు న్యాయ సర్వీసులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అలాగే న్యాయపదజాలం పట్ల కూడా ప్రతి ఒక్కరికీ అవగాహన ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. సమాన అవకాశాల ప్రాతిపదికగా అందరికీ రాజ్యాంగబద్ధమైన రీతిలో న్యాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ న్యాయ సర్వీసుల అథారిటీ, అలాగే రాష్ట్రాల న్యాయ సేవల అథారిటీ అత్యంత కీలక వాహకాలని జస్టిస్ గొగోయ్ స్పష్టం చేశారు. దేశం నలుమూలల ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడడం అన్నది ఈ సంస్థల గురుతర బాధ్యత అని చీఫ్ జస్టిస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ హక్కుల గురించి తెలుసుకోవడం వల్ల వాటిని సాధించుకోవడం వల్ల సామాజికంగా, ఆర్థికంగా ప్రగతిని సాధించుకోవచ్చన్నారు. న్యాయ పదజాల అవగాహన, న్యాయపరమైన చైతన్యం అవిభాజ్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ న్యాయపరమైన హక్కుల గురించి ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోకపోతే న్యాయ సహాయ ఉద్యమం నిర్ధేశిత లక్ష్యాలకు చేరుకోదన్నారు.
ప్రస్తుత న్యాయ విద్య అన్నది కేవలం యూనివర్సిటీలకే పరిమితమైందని, భవిష్యత్తు లాయర్లను తయారు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అయితే దీనికి అతీతంగా కూడా న్యాయ విద్య ముందుకు సాగాలని ఆయన ఉద్ఘాటించారు. న్యాయపరమైన అంశాలన్నవి స్కూళ్ళు, కాలేజీల పాఠ్యాంశాల్లో ఉన్నాయని, అయితే కేవలం అవగాహనకే పరిమితం కాకుండా ఇతరత్రా విద్యార్థుల్లో చైతన్యం తీసుకుని రావాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరి సమగ్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయపరమైన విజ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకుని రావాలన్నారు. ఈ కార్యక్రమాల్లో లా కాలేజీలే కాకుండా స్కూళ్ళు, కాలేజీల విద్యార్థులకు విస్తృత ప్రమేయం కల్పించాలన్నారు.

చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న గొగోయ్