జాతీయ వార్తలు

సీబీఐతో దర్యాప్తు చేయిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 18: కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తుకు సిఫారసు చేస్తానని కొత్త ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప ఆదివారం ఇక్కడ ప్రకటించారు. ‘అంతర్జాతీయ సంస్థ’ దర్యాప్తుకు ఆదేశించినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార స్వామి పేర్కొన్నారు. అయితే, జేడీ(ఎస్) మిత్ర పక్షమయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో రెండుగా చీలిపోయింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తే నిజం బయటపడుతుందని సీఎల్‌పీ నాయకుడు సిద్ధరామయ్య అన్నారు. సిద్ధరామయ్యతో పాటు ఎం.మల్లికార్జున ఖర్గే, మాజీ హోంమంత్రి ఎంబీ పాటిల్ కూడా దర్యాప్తు జరిపించాలని కోరారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మరో కీలక నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను తోసిపుచ్చారు. సీఎల్‌పీ నాయకుడు సిద్ధరామయ్య సహా అనేక మంది నాయకులు కోరినందువల్ల ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తాను నిర్ణయించానని యెడియూరప్ప ఇక్కడ విలేఖరులకు చెప్పారు.