జాతీయ వార్తలు

కునుకుతీయని కర్తవ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 18: కర్తవ్యం, విధుల నిర్వహణలో వారికి ఎవరూ సాటిరారు. వందలాది మైళ్ల దూరంలోని తమ స్వగ్రామాలను విడిచిపెట్టి దేశ రక్షణ కోసం కంకణబద్ధులు కావడం ఒక్కటే వారికి తెలుసు. ఒకసారి తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు..మరోసారి సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు గంటల కొద్దీ నిరంతరం శాంతి, భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉంటూ భరతమాత సేవలో తరించేందుకు తహతహలాడుతుంటారు. వారే..పారా మిటలరీ దళాలు. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 అధికరణను ఈనెల 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిరంతరం గట్టి నిఘా చేపట్టడంలో పారా మిలటరీ దళాల కృషి అనన్య సామాన్యం. జమ్మూకాశ్మీర్‌లోని వీధుల్లో సాయుధ సామాగ్రితోపాటు లాఠీలను చేతబట్టుకుని ఎలాంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా సురక్షితంగా ఉంచేందుకు నిఘా వేస్తున్నారు. గత వారం రోజులుగా శ్రీనగర్, కాశ్మీర్ వ్యాలీ అంతటా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో సైతం శాంతి, భద్రతలకు ఎలాంటి భంగం కాకుండా సీఆర్‌పీఎఫ్ దళాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయి. పగటి పూట గస్తీ కాసే జవాన్ల కంటే రాత్రి సమయాల్లో నిఘా, గస్తీలో పాల్గొనే సిబ్బంది అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని, రాత్రంతా కంటిమీద రెప్ప వాల్చకుండా డేగకళ్లతో ప్రతి క్షణాన్ని పర్యవేక్షించడంలో వారు తమ బాధ్యతలను ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నారని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. పారామిటలరీ దళాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్ యాదవ్, బీహార్‌కు చెందిన భానుశేఖర్ రాత్రిపూట నగరమంతటా పెట్రోలింగ్ నిర్వహిస్తూ సిబ్బందికి దోహదపడుతున్నారు. ‘నివారణ కంటే ముందు జాగ్రత మంచిది’ అని దాల్ లేక్ చుట్టుపక్కల గల మారుమూల ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలసి మార్చ్ఫాస్ట్‌లో పాల్గొన్న సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంజీవ్ యాదవ్ అన్నారు. పగటి పూట విధులు నిర్వహించడం కంటే రాత్రి పూట గస్తీ చేపట్టడం ఎంతో కష్టసాధ్యమని, కానీ తమ జవాన్లు అంకితభావంతో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు శాంతి, భద్రతల నిర్వహణలో పాలుపంచుకోవడం మామూలు విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. జవాన్లు చేస్తున్న డ్యూటీ కేవలం పెట్రోలింగ్ మాత్రమే కాదని, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, అదేవిధంగా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ గట్టి నిఘా చేపడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా తాము తీసుకున్న ప్రత్యేక జాగ్రత్త వల్లే ఉగ్రవాదులు అధునాతన పేలుడు సామాగ్రి (ఎల్‌ఈడీ)లను జోలికి వెళ్లేందుకు ఆస్కారం లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నామని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను తొలగించిన తర్వాత ఆగస్టు 5 నుంచి సమస్యాత్మక ప్రాంతమంతటా బారికేడ్లను ఏర్పాటు చేయడం, ఆందోళనకారులు రాళ్లు విసరడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా భద్రతా బలగాలను మరింత అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. వేలాది సీఆర్‌పీఎఫ్ జవాన్లను శ్రీనగర్, కాశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 5 నుంచి నిరంతరం నిఘా కోసం నియమించినట్టు శాస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ) అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం కుమార్ తెలిపారు. అల్లర్లు, అలజడులు జరిగేందుకు ఆస్కారం ఉన్న ఎయిల్ మసీదు, పురాతన జామా మసీదు తదితర ప్రాంతాల్లో మరింత ఎక్కువ మంది జవాన్లు అనుక్షణం శాంతి, భద్రతలను పర్యవేక్షించేందుకు నియమించామని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కాశ్మీర్‌లో మళ్లీ ఆంక్షలు
* పలుచోట్ల హింసాత్మక ఘటనలు
శ్రీనగర్: కాశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో శనివారం ఆంక్షలను సడలించినా అదేరోజు కొన్ని ప్రాంతాల్లో అల్లరి మూకలు పలు హింసాత్మక చర్యలకు దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆదివారం నుంచి మళ్లీ ఆంక్షలు విధించడంతోపాటు నిబంధనలను కఠినతరం చేసినట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. నగరంలోని 12 చోట్ల ఆందోళనకారులు చేపట్టిన నిరసనల వల్ల పలువురు గాయపడ్డారు. హజ్ యాత్రకు సౌదీ అరేబియా వెళ్లిన దాదాపు 300 మంది యాత్రీకులు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఉదయం దిగారని, ఆ సమయంలో ఆయా కుటుంబాలకు చెందిన ఒక వ్యక్తిని మాత్రమే ఎయిర్‌పోర్టులోకి అనుమతించామని సంబంధిత వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం నగరంలోని ఆరు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఎనిమిది మంది గాయపడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిది రోహిత్ కన్సాల్ తెలిపారు.
చిత్రాలు.. రాత్రిపూట గస్తీ *కాశ్మీర్‌లో జవాన్ల రెప్పవాల్చని నిఘా *అనుక్షణం అప్రమత్తత