జాతీయ వార్తలు

గాంధీ-నెహ్రూ కుటుంబాలకే.. కాంగ్రెస్‌ను నడిపించే సత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని నడిపించడం ‘బ్రాండ్ ఈక్విటీ’ అయిన గాంధీ-నెహ్రూ కుటుంబంలోని వ్యక్తులకు తప్ప మరెవరికీ సాధ్యం కాదని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. సరైన భావజాలం లేకపోవడం వల్లే అతి పెద్దదైన కాంగ్రెస్ పార్టీ బలహీనమైన ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతోందని, ఇపుడు దేశంలో భిన్నధృవ రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన అన్నారు. అయితే, బలమైన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రస్తుతం మతతత్వ భావజాలం కలిగిన బీజేపీని ఎదుర్కోగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ మీడియాతో శనివారంనాడు ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం దేశంలోని ప్రాంతీయ పార్టీలు రానున్న రోజుల్లో తమ మనుగడను కోల్పోనున్నాయి. దీని ప్రభావం దేశంలోని భిన్నధృవ రాజకీయాలు మరింత బలపడేందుకు దోహదపడతాయి’ అని ఆయన పేర్కొన్నారు. ‘్భన్నధృవ రాజకీయాలు పనిచేయడం వల్ల మళ్లీ మేము అధికారంలోకి రాగలం. అంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మంచి భవిష్యత్తు ఉంది’ అని ఆయన అన్నారు. సరైన భావజాలంతో కూడిన ప్రేరణ, జనం మద్దతు ప్రాంతీయ పార్టీలకు లేవని, అవి కేవలం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కే ఉన్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఇలాంటి కష్టసమయంలో పార్టీ సీనియర్ నేతల ఒత్తిడి మేరకు అయిష్టపూర్వకంగానే సోనియా గాంధీ ఆ పదవిని చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ‘క్లిష్ట సమయాల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సోనియా గాంధీ చేపట్టారు. ఆమె నాయకత్వంలోనే 2004, 2009లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగాం’ అని ఆధిర్ రంజన్ చౌదరి అన్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టినా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు ఆమె తన సేవలను సమర్ధంగా అందించగలరనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కూడా అయిన ఆధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నడిపించాలంటే గాంధీ కుటుంబానికి చెందిన నాయకులకే తప్ప మరెవరికీ సాధ్యం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.