జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 17: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తుతోపాటు మొబైల్ ఫోన్లు, ల్యాండ్‌లైన్ ఫోన్లపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇపుడు రాష్ట్రంలో చాలావరకు ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇటు ప్రజలు, అటు ఫోన్ల వినియోగంపై ఉన్న ఆంక్షలను శనివారంనాడు సడలించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, కాశ్మీర్ వ్యాలీ అంతటా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు కొనసాగుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాశ్మీర్‌లోని ఆంక్షలు విధించిన మొత్తం 96 పోలీస్ స్టేషన్లు, టెలిఫోన్ ఎక్స్ఛేంజీల్లో 35 పోలీస్ స్టేషన్ల పరిధిలో గల ప్రాంతాలు, 17 టెలిఫోన్ ఎక్స్ఛేంజీల్లో శనివారం నుంచిగ ఆంక్షలు ఎత్తివేయడంతో యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగుతాయని ఆ వర్గాలు తెలిపాయి. 50,000 ల్యాండ్‌లైన్ల ఫోన్లు సైతం పనిచేయడం ప్రారంభిస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో సైతం క్రమానుగతంగా పనిచేయడం ప్రారంభిస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, కాశ్మీర్ వ్యాలీ అంతటా గట్టి భద్రతా ఏర్పాట్లు మాత్రం కొనసాగుతాయని, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసినా తమ దైనందిన అవవసరాల కోసం వెళ్లే ప్రజలు తప్పనిసరిగా ఈ బారికేడ్ల ప్రాంతంలో తనిఖీలకు సహకరించాలని ఆ వర్గాలు సూచించాయి.
ఇదిలావుండగా, ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ మీడియాతో మాట్లాడుతూ వ్యాలీ అంతటా ప్రాథమిక పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం అవుతాయని, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు సైతం అదే రోజు నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయని ఆయన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శనివారంనాడు పలు దుకాణాలు పనిచేయడం ప్రారంభించడంతోప్రైవేటు వాహనాల రాకపోకలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.
కాగా, శ్రీనగర్‌లోని సివిల్ లైన్స్, కంటోనె్మంట్, ఎయిర్‌పోర్టు, రాజ్ బాగ్, జవహర్‌నగర్ ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్ల ఫోన్లను పునరుద్ధరించామని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. అయితే, వాణిజ్య ప్రాంతమైన లాల్ చౌక్, ప్రెస్ ఎన్‌క్లేవ్ వంటి ప్రాంతాల్లో మాత్రం ల్యాండ్‌లైన్ ఫోన్లపై ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. రానున్న మరికొద్ది రోజుల్లో మరో 20 టెలిఫోన్ ఎక్స్ఛేంజీల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేందుకు ఆస్కారం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ కాశ్మీర్‌లోని బుడ్‌గామ్, సోనామార్గ్, మణిగామ్, తూర్పు కాశ్మీర్‌లోని గురెజ్, తాన్‌మార్గ్, ఉరీ కెరన్ కర్నాహ్, తాంగ్‌ధర్, దక్షిణ కాశ్మీర్‌లోని కావజిగుండ్, ఫాల్గామ్ ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్ ఫోన్ల సేవలను పునరుద్ధరించినట్టు సంబంధిత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సివిల్ లైన్ ఏరియాలతోపాటు వ్యాలీలోని జిల్లా ప్రధాన కార్యాలయంలో ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరిగాయని, అంతర్‌రాష్ట్ర క్యాబ్ సర్వీసులు నడుస్తున్నాయని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పెట్రోల్, డీజిల్ స్టేషన్లు మాత్రం చాలావరకు ఇంకా తెరవలేదు. జమ్మూ రీజియన్‌లోని ఐదు జిల్లాల్లో మొబైల్ ఇంటర్‌నెట్ సేవలను పునరుద్ధరించామని, ఇవి కేవలం కాశ్మీర్ వ్యాలీలోని కేవలం 35 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలకే వర్తిస్తాయని రాష్ట్ర పోలీస్ చీఫ్ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.

చిత్రాలు.. శ్రీనగర్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధి రోహిత్ కన్సాల్, ఐజీ స్వయం ప్రకాష్ *370 అధికరణకు నిరసనగా శనివారం శ్రీనగర్‌లో రహదారులను దిగ్బంధం చేస్తున్న పౌరులు