జాతీయ వార్తలు

ఉత్తరాదిలో కుండపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా/ జైపూర్/ తిరువనంతపురం, ఆగస్టు 17: కుండపోత వర్షాలు శనివారం ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. భాక్రా డ్యామ్ నుంచి వరద నీటిని వదలడంతో పంజాబ్‌లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో యమునా నదిలో ప్రవాహం ప్రమాద స్థాయికి సమీపించింది. వరదలు పోటెత్తిన కేరళలో క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 113 మంది ప్రజలు వర్షాలు, వరదల కారణంగా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా నది పొంగిపొర్లుతుండటం వల్ల కృష్ణా, గుంటూరు రెండు జిల్లాల్లోని 87గ్రామాలు, వందలాది ఎకరాలలో పంటలు నీట మునిగాయి. కృష్ణానదిలో మునిగిపోయిన ఒక బాలిక మృతదేహాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. దీంతో రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య రెండుకు పెరిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి శనివారం తెల్లవారు జామున గరిష్ఠంగా 8.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయితే, ఉదయం పది గంటల సమయంలో ఈ వరద నీటి విడుదల 7.99 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీలోకి ఎగువ ప్రాంతం నుంచి నిలకడగా 7.57 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోందని రాష్ట్ర రియల్-టైమ్ గవర్నెన్స్ సెంటర్ తెలిపింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని పొంగిపొర్లుతున్న ఒక డ్యామ్‌లోనుంచి 17 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక రోడ్లు దిగ్బంధం అయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కాంగ్రా జిల్లాలో శనివారం విద్యాసంస్థలను మూసివేశారు. పాలంపూర్ సమీపంలో అనేక మంది ప్రజలు చిక్కుకుపోయారు. భాక్రా డ్యామ్ పరివాహక ప్రాంతంలో కుండపోత వర్షాల కారణంగా డ్యామ్ గేట్లు ఎత్తివేసి వరద నీటిని భారీగా కిందికి వదులుతుండటంతో పంజాబ్‌లోని అనేక జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. లూథియానా, అమృత్‌సర్, మొహాలి, చండీగఢ్ సహా పంజాబ్‌లోని అనేక ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. సట్లెజ్ నది సమీపంలో, లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఢిల్లీలో యమునా నది ప్రవాహం ప్రమాద స్థాయికి చేరువయింది.
అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. వరదలు వస్తే చేపట్టవలసిన చర్యల గురించి కసరత్తు చేశారు. రాజస్థాన్‌లో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా, కేరళలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు సహాయక శిబిరాల నుంచి తమ ఇళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు.

చిత్రాలు.. అజ్మీర్లో..,జమ్మూలో..