జాతీయ వార్తలు

ఉగ్రవాదులకు కవచంగా ఉండేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఆగస్టు 17: రాజ్యాంగంలోని 370-అధికరణ ఇంత కాలం ఉగ్రవాదులకు, వారి పోషకులకు ‘కవచం’గా ఉండేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఇకమీదట ఉగ్రవాదులు 370-అధికరణ కోసం చెలరేగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లోని లీగల్ సర్వీసెస్ అథారిటీ 17వ అఖిల భారత సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రవి శంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సమావేశాల ముఖ్యోద్ధేశ్యాన్ని వివరించారు. రాజ్యాంగంలోని 370-అధికరణ రద్దు గురించి ప్రశ్నించగా జమ్మూ-కాశ్మీర్ ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. జమ్మూ-కాశ్మీర్‌కు ఇంత కాలం ఉన్న ప్రత్యేక హోదాను తమ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది అత్యంత కష్టమైన పని అన్నారు. జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చామని ఆయన తెలిపారు. ఉగ్రవాదులకు, వారి పోషకులకు ఇంత కాలం ఆర్టికల్-370 రక్షణ కవచంగా ఉండేదని విమర్శించారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 5న 370 అధికరణను రద్దుకు, జమ్మూ-కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిందన్నారు. అభివృద్ధి పథంలో జమ్మూ-కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను నడిపిస్తామని ఆయన తెలిపారు. ఇకమీదట ప్రజలకు బాల్య వివాహాలు, అవినీతి నిరోధక చట్టం మినహాయింపులేమీ ఉండవన్నారు. బాలకోట్‌పై దాడి చేసిన తరహాలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకె)పైనా దాడి చేసేందుకు భారత్ సమాయత్తమవుతున్నదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. తమకు అటువంటి ఉద్దేశ్యం ఏమీ లేదన్నారు. అయితే పాక్ ఎటువంటి చర్యలకు పాల్పడినా సరైన సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రక్షణ విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నామని, ఉగ్రవాదులు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ధీటైన జవాబిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
చిత్రం...కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్