జాతీయ వార్తలు

పనులు చేయకపోతే..బడిత పూజే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, ఆగస్టు 17: సమస్యలు పరిష్కరించకపోతే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి, అధికారులను కొట్టండి అని ప్రజలకు పిలుపు ఇవ్వాల్సి వస్తుందని కేంద్ర రోడ్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొంత మంది అధికారులను ఉద్ధేశించి హెచ్చరించారు. శనివారం ఇక్కడ జరిగిన లఘు ఉద్యోగ్ భారతి సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రసంగిస్తూ ఇక్కడికి వచ్చిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు నిర్బయంగా తమ వ్యాపారాలను విస్తరించుకోవాలని సూచించారు. వ్యాపార వేత్తలను ప్రభుత్వ అధికారులు కొంత మంది వేధిస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు పని చేయకపోవడం ఏమిటీ? అని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమల వద్దకు ఇంత మంది ఇన్‌స్పెక్టర్లు ఎందుకు వెళుతున్నారు?, వారు లంచం తీసుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను నేరుగా అటువంటి అధికారుల ముఖాల ముందే చెప్పగలనని అన్నారు. ‘అధికారులు ప్రజా సేవకులు.. నేను ప్రజలతో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాను, నేను ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది, మీరు ఏదైనా దొంగలిస్తే, మీరు దొంగ అనాల్సి వస్తుంది..’ అని ఆయన తెలిపారు. తాను ఈ రోజు ఆర్టీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించాను, ఈ సమావేశానికి డైరెక్టర్, రవాణా శాఖ కమిషనర్ హాజరయ్యారని ఆయన చెప్పారు. ఈ సమస్యను ఎనిమిది రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించానని ఆయన తెలిపారు. లేనిపక్షంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి, పని చేయని అధికారులను కొట్టండి (దులాయి కరో) అని పిలుపునివ్వాల్సి వస్తుందని కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరించారు. మంత్రి గడ్కరీ అధికారులకు హెచ్చరికలు చేశారే తప్ప సమస్య గురించి వివరంగా చెప్పలేదు.