జాతీయ వార్తలు

ఉచిత బియ్యం కోటాను తగ్గిస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 17: తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అన్న భాగ్య’ పథకాన్ని నీరుగారిస్తే సహించబోమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్న భాగ్య పథకం ద్వారా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగిందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. నిరుపేద కుటుంబాలకు అందిస్తున్న బియ్యం కోటాను తగ్గించాలన్న ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తమకు తెలిసిందన్నారు. అలా చేస్తే పేద ప్రజలు ప్రభుత్వాన్ని క్షమించరని ఆయన తెలిపారు. అంతేకాదు తమ పార్టీ కూడా ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుందని ఆయన హెచ్చరించారు. కాబట్టి నిరు పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్న అన్న భాగ్య పథకం జోలికి వెళ్ళవద్దని ఆయన సూచించారు. 2013 సంవత్సరంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న భాగ్య పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దీంతో 1.12 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా నెలకు 30 కిలోల బియ్యం అందుతున్నదని ఆయన వివరించారు. బెంగళూరులోని ఇందిరా క్యాంటీన్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు. ఇందిరా క్యాంటీన్లకు ఏడాదికి రూ.200 కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాఉండగా ఈ పథకం ద్వారా ఎన్ని కుటుంబాలు లబ్ది పొందుతున్నాయో సర్వే చేయాల్సిందిగా ముఖ్యమంత్రి యెడుయూరప్ప తాజాగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ పథకం లోగడ దుర్వినియోగమైనట్లు ఆయన విమర్శించారు.