జాతీయ వార్తలు

మేమూ రాముడి వంశస్థులమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ్‌పూర్ / జైపూర్, ఆగస్టు 13: ‘రాముడి వారసులున్నారా?’ అని సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నకు ‘మేము సైతం’ అంటూ మరికొంతమంది ముందుకొస్తున్నారు. మొన్న రాజస్థాన్‌లోని రాజసమంద్ ఎంపీ దియా కుమారి తాము కుశుడి వారసులమేనంటూ ముందుకు రాగా ఇప్పుడు పూర్వ రాజ వంశీకుడైన మరొకరితో పాటు రాజస్థాన్ రవాణా శాఖ మంత్రి కూడా ‘మేము రాముడి వారసులమే ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు.. మావద్ద అవసరమైన ఆధారాలన్నీ ఉన్నాయి’ అని మంగళవారం స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు మా వద్ద ఉన్నాయి.. అవసరమైతే చూపిస్తాం అంటూ రాజవంశానికి చెందిన అరవింద్ సింగ్‌తో పాటు రాజస్థాన్ రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌సింగ్ కచారవాస్ వెల్లడించారు. మేము శ్రీరాముడి వంశానికి చెందిన సూర్యవంశ రాజపుత్‌లం.. ఇందులో రెండో అభిప్రాయం లేదు.. మా కుటుంబంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రాముడి వంశీకులు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే కోర్టుకు అవసరమైన శాసనాలు, చారిత్రక ఆధారాలను మేము కోర్టుకు సమర్పించగలం అని చెప్పారు. ‘రామ జన్మభూమికి సంబంధించి మేము ఎలాంటి వాటాలను కోరుకోవడం లేదు.. అయితే, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని కోరుకొంటున్నాం’ అని అరవింద్‌సింగ్ స్పష్టం చేశారు.