జాతీయ వార్తలు

దశలవారీగా ఆంక్షలు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దు నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో విధించని ఆంక్షలను దశలవారీగా సడలిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. జమ్మూను శ్రీనగర్‌తో కలిపే హైవేలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వెల్లడించారు. దైనందిన వారీగా ఈ హైవేలో 1500కు పైగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయని తెలిపారు. కాశ్మీర్ లోయ ప్రాంతంలో ఆంక్షలను సడలిస్తున్నామని.. అలాగే, జమ్మూ ప్రాంతంలో పరిస్థితి గణనీయంగా మెరుగైందని తెలిపారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. కాశ్మీర్ లోయలోని ప్రతి ఆసుపత్రిలోనూ అత్యవసర మందులను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి రిహార్సల్స్ జరిగాయని తెలిపారు. అలాగే, ఈ వేడుకలను సక్రమంగా నిర్వర్తించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని అన్నారు.
పరిస్థితి సంక్లిష్టం: జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితి నెలకొన్న దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ఆంక్షలు సడలిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ఆంక్షల నేపథ్యంలో ప్రజలకు కొంతమేర అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఆంక్షల నేపథ్యంలో తప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదని స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజకీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందనీ.. వాస్తవ పరిస్థితులు తెలుసుకొన్న వెంటనే వీరిని విడుదల చేశామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని.. వీలైనంత త్వరలో ఆంక్షలను సరళతరం చేయాలన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఉందని చెప్పారు. ఏదైనా స్థానిక అధికార యంత్రాంగమే పరిస్థితిని బట్టి చర్యలు తీసుకొంటుందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో మొదటిసారి ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. 2016లో కూడా ఇలాంటి ఆంక్షలను అప్పటి ప్రభుత్వం విధించిందని గుర్తు చేశారు. హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్గన్‌వానిని హతమార్చినప్పుడు వేర్పాటువాదులు ఆందోళనలకు పిలుపునిచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ఆ సందర్భంలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆంక్షలను విధించారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘అసాధారణ పరిస్థితి’ నెలకొన్న దృష్ట్యా ప్రజలకు కొంతమేర అసౌకర్యం కలుగుతోందని చెప్పారు. వీలైనంత త్వరగా వీటిని సడలించే అవకాశం ఉందని వివరించారు. మార్కెట్‌లను తెరవడం, ఇంటింటికీ ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నామనీ.. ఆసుపత్రులను తెరుస్తున్నారని చెప్పారు.

చిత్రం...కాశ్మీర్ వీధుల్లో భద్రతాదళాల గస్తీ..