జాతీయ వార్తలు

అమిత్ షాతో వివేక్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: మాజీ కేంద్ర మంత్రి జీ వెంకటస్వామి కుమారుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ జీ వివేక్ మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి చర్చలు జరిపారు. వివేక్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పార్టీ అధ్యక్షుడి వద్దకు తీసుకెళ్లారు. వివేక్ త్వరలోనే బీజేపీలో చేరతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అమిత్‌షాను కలుసుకోవటం గమనార్హం. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుఅధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న వివేక్ దీనిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వివేక్ ఈనెల 15 తేదీలోగా బీజేపీలో చేరతారని తెలిసింది. తెలంగాణ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు.

చిత్రం...ఢిల్లీలో అమిత్ షాను కలిసిన పెద్దపల్లి మాజీ ఎంపీ జీ వివేక్