జాతీయ వార్తలు

మోదీ సమాధానం చెప్పాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు భారతదేశం తన మధ్యవర్తిత్వాన్ని కోరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఎన్‌డీఏ ప్రభుత్వం ఖండించింది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరలేదు.. మధ్యవర్తితత్వం చేయాలని డోనాల్డ్ ట్రంప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయశంకర్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించారు. జయశంకర్ ప్రకటనతో సంతృప్తి చెందని ప్రతిపక్షం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి సమాధానం ఇవ్వాలని ఉభయ సభల్లో పట్టుపట్టింది. ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తూ నరేంద్ర మోదీ సభకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుపట్టటంతో పాటు లోక్‌సభ, రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. జమ్ముకాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు భారత-పాకిస్తాన్ దేశాల మధ్య మధ్వవర్తిత్వం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జపాన్‌లోని ఒసాకా నగరంలో తనను కలిసిప్పుడు విజ్ఞప్తి చేశారని డొనాల్డ్ ట్రంప్ నిన్న వాషింగ్‌టన్ నగరంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ సమక్షంలో ప్రకటించటం తెలిసిందే. ట్రంప్ ప్రకటనపై ప్రతిపక్షాలు మంగళవారం ఉభయసభల్లో ఉదయం నుండే పెద్దఎత్తున గొడవ చేశాయి. జమ్ముకాశ్మీర్ సమస్యలో ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అనుమతించకూడదన్న విధానాన్ని మోదీ ప్రభుత్వం మార్చివేసిందా? అంటూ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. నరేంద్ర మోదీ సభకు వచ్చి వివరణ ఇవ్వాలని వారు పట్టుపట్టారు. దీనితో ఉభయ సభలు పలుమార్లు గందరగోళంలో పడిపోయాయి. నరేంద్ర మోదీ ఉభయ సభలకు రాలేదు కానీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ ట్రంట్ చేసిన మధ్యవర్తితత్వం ప్రకటన పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేశారు. జమ్ముకాశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని కోరటం భారతదేశం విధానం కాదు.. మధ్యవర్తితత్వం చేయాలని ట్రంప్‌ను ప్రధాన మంత్రి కోరలేదని జయశంకర్ పలుమార్లు స్పష్టం చేశారు. ఇది భారత-పాకిస్తాన్ దేశాల ద్వైపాక్షిక సమస్య.. సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనల ఆధారంగా జమ్ముకాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవలసి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. జయశంకర్ ఈ ప్రకటన చేస్తుంటే ప్రతిపక్ష సభ్యులు నిలబడి ప్రధాన మంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలి.. జయశంకర్ మీనన్ సమాధానం మాకు సంతృప్తినివ్వదంటూ గొడవ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గొడవ మూలంగా జయశంకర్ మీనన్ ప్రకటనను సభ్యులు వినలేకపోయారని హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జయశంకర్ మరోసారి ప్రకటన చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. దీనితో స్పీకర్ ఓం బిర్లా మరోసారి జయశంకర్‌తో ప్రకటన చేయించారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే ఇతర ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ నుండి వాకౌట్ చేశారు. రాజ్యసభలో కూడా ప్రధాన మంత్రి వచ్చి సమాధానం ఇవ్వనందుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన మధ్యవర్తిత్వం ప్రకటన అత్యంత తీవ్రమైందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఈ విషయంపై నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత తీవ్రమైన అంశంపై ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం ప్రశ్నించారు. మేమంతా సభ నుండి వాకౌట్ చేస్తాం.. అధికార పక్షమే ఇక్కడ కూర్చుని సభను నడిపించుకోవాలని ప్రతిపక్షం విమర్శించింది. మంత్రి వివరణ ఇచ్చిన తరువాత లోక్‌సభ ప్రశాంతంగా జరుగుతుంది.. మీరెందుకు గొడవ చేస్తున్నారని బీజేపీ నాయకుడు భుపేందేర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను గులాం నబీ ఆజాద్ ఖండించారు. లోక్‌సభలో ఆమోదించారు కాబట్టి ఇక్కడ ఆమోదించాలనడం మంచిది కాదు.. అలాంటప్పుడు రెండు సభలు ఎందుకు ఒకే సభ పెట్టుకోవాలని ఆయన ఆవేశంతో అన్నారు. ట్రంప్ ప్రకటనపై గొడవ చేసిన ప్రతిపక్ష సభ్యులు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇచ్చే సమాధానం కూడా వినాలని స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతిపక్ష సభ్యులు మాత్రం పెద్దఎత్తున గొడవ చేస్తూ నరేంద్ర మోదీ సభకు వచ్చి సమాధానం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అనంతరం సభయసభల్లో ప్రతిపక్షం వాకౌట్ చేసింది.
చిత్రం...మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయశంకర్