జాతీయ వార్తలు

రాష్ట్రాలకు అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయకుండా ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేయటం, కొందరిని ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు వీలు కల్పించటం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ప్రజలను అవమానిస్తోందని వైసీపీ లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ ఆరోపించారు. మంగళవారం లోక్‌సభలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాధవ్ పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయకుండా అక్కడి ఉగ్రవాదుల ఆస్తులను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకునేందుకు బిల్లులో వీలు కల్పించటం రాష్ట్రాల హక్కులను హరించడమేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తద్వారా రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రుల నిజాయితీని శంకిస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేసేందుకు ఇంతకాలం రాష్ట్ర డీజీపీలకు ఉన్న హక్కును తొలగించటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒక రాష్ట్రంలో ఉగ్రవాదులకున్న ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్‌ఐఏ మొదట స్థానిక డీజీపీ అనుమతి తీసుకోవలసి ఉండేది.. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీనిని తొలగించి రాష్ట్ర డీజీపీల అనుమతి తీసుకోకుండానే అక్కడి ఉగ్రవాదుల ఆస్తులను ఎన్‌ఐఏ జప్తు చేసేందుకు వీలు కల్పించారని ఆయన చెప్పారు. బిల్లులో ఉన్న ఈ సవరణను తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోందని గోరంట్ల మాధవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ సవరణను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ ద్వారా రాష్ట్రాల అధికారాలను హరిస్తోందని ఆయన ఆరోపించారు. సమాఖ్య విధానానికి ఇది పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రుల నిజాయితీని శంకిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా ఆ ప్రాంతానికి చెందినవారిని ఉగ్రవాదులుగా ప్రకటించటం వలన అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నదని గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. కొందరు వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించే ముందు ఈ విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తే శాంతిభద్రతలను కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేకుండా కొందరు వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించటం వలన రాష్ట్రం ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులుగా ప్రకటించే సమాచారాన్ని మొదట సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా దీనిని సవరించాలని ఆయన ప్రతిపాదించారు.
చిత్రం... వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్