జాతీయ వార్తలు

కాశ్మీర్ పరిష్కారం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పందోరి, జూలై 20: కాశ్మీర్ సమస్యను చర్చలు ద్వారా పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని, అది సాధ్యం కాని పక్షంలో ఈ జఠిల సమస్యను ఎలా నివృత్తి చేయాలో తమకు తెలుసునని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం నాడిక్కడ స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం ఖాయమని, ప్రపంచంలో ఏ శక్తీ దీనిని అడ్డుకోజాలదని ఆయన ఉద్ఘాటించారు. కాశ్మీరాన్ని భూతల స్వర్గంగా, అలాగే పర్యాటక స్వర్గ్ధామంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆశయమని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్ పర్యటన సందర్భంగా అమరయోధులకు యుద్ధ సంస్మరణ కేంద్రం వద్ద ఆయన నివాళులు అర్పించారు. అలాగే సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన రెండు కీలక వంతెనలను ఆయన ప్రారంభించారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో వీటి నిర్మాణం జరిగిందని ఆయన తెలిపారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సహకరించాల్సిందిగా, చర్చలకు రావాల్సిందిగా సంబంధిత నాయకులను అనేక సార్లు అభ్యర్థించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసి సుసంపన్నం చేయాలన్న ధృక్ఫదంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని కటువా, సాంబ జిల్లాల్లో నిర్మితమైన ఈ రెండు వంతెనలు అత్యంత కీలకమైనవని, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలకు సైనిక దళాలను తరలించడానిక ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా కటువా జిల్లాల్లో నిర్మించిన వంద మీటర్ల వంతెన సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన వాటిలో అత్యంత పొడవైనదని పేర్కొన్న ఆయన రహదారులు వంతెనలు అన్నవి ఓ జాతి జీవనాడులని అభివర్ణించారు. అలాగే మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ఇవి ఎంతగానో సహకరిస్తాయన్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత గల ఈ వంతెనలు నిర్మించినందుకు సరిహద్దు రహదారుల సమస్యను రాజ్‌నాథ్ అభివర్ణించారు. కాశ్మీర్‌లో అన్ని ప్రాంతాల మధ్య సంథానతను పెంచాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని పేర్కొన్న రాజ్‌నాథ్ తాజాగా నిర్మించిన వంతెనల పురోగతి గురించి, నిధుల అందుబాటు గురించి ప్రధాని మోదీ ఎంతో ఆసక్తి కనబరిచే వారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
చిత్రం... కార్గిల్ జిల్లాలో సైనిక సిబ్బందితో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్