జాతీయ వార్తలు

ఆగస్టు 2వరకు పార్లమెంటు భేటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంటు సమావేశాలను పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోద ప్రక్రియను పూర్తి చేయడం కోసం ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలను పొడిగించే అవకాశం ఉందని ఆ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశాలు షెడ్యూలు ప్రకారం ఈ నెల 26తో ముగియాల్సి ఉంది. కాని, ప్రభుత్వం ప్రకటించిన అన్ని బిల్లులను ఆమోదింప చేసుకోవడానికి పార్లమెంటు సమావేశాలను ఆగస్టు రెండో తేదీ వరకు పొడిగించడానికి కసరత్తు చేస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలను కూడా ఒప్పించడానికి ఆ పార్టీల నాయకులతో కేంద్ర మంత్రులు సంప్రదింపులు జరుపుతున్నారు. కొంత మంది ప్రతిపక్ష నాయకులు ఈ ప్రతిపాదన పట్ల తాము సానుకూలంగా లేమని చెప్పినప్పటికీ, ఈ సెషన్ షెడ్యూలు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు సహా మొత్తం 13 బిల్లులు పార్లమెంటు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి.