జాతీయ వార్తలు

రాలిపోతున్న రాబందులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: మూడు దశాబ్దాల్లో పక్షి జాతుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని లోక్‌సభలో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మూడు దశాబ్దాల క్రితం 40 మిలియన్లు ఉన్న పక్షి జాతుల సంఖ్య ఇప్పుడు కేవలం 19వేలకు పడిపోయిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రస్ఫుటవౌతోందని లోక్‌సభలో శుక్రవారం దేశంలో పక్షి జాతుల పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ముఖ్యంగా మూడు రకాల రాబందుల జాతులు ఆరు వేలు, 12 వేలు, వెయ్యిగా మాత్రమే ఉన్నాయని చెప్పారు. ‘పక్షి జాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.. 90వ దశకం మధ్యలోనూ.. 2007 నాటికి మూడు రకాల రాబందుల జాతులు 99 శాతం తగ్గిపోయాయి’ అని వివరించారు. 1990 నుంచి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల నేతృత్వంలోని బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్) ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పక్షిజాతుల ప్రమాణాలపై సర్వే నిర్వహిస్తోందని చెప్పారు. ‘డిక్లొఫినాక్’ అనే డ్రగ్ ఇవ్వడం ద్వారా కలిగే బాధ, మంటలను తట్టుకోలేక పై మూడు రకాల జాతులు మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా విషపూరితమైన ఈ డ్రగ్ ఇవ్వడం ద్వారా ఈ జాతి అంతరిస్తోందని అన్నారు. 2006 సంవత్సరంలో ఈ డ్రగ్‌పై నిషేధం విధించి.. 2008లో గెజిట్‌లో పొందుపరచినట్లు మంత్రి జావడేకర్ వెల్లడించారు.