జాతీయ వార్తలు

దేశ వ్యాప్తంగా 75 ఇంజనీరింగ్ కాలేజీల మూత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఇంజనీరింగ్ విద్యకు ఆదరణ తగ్గుతుందా? ఆ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు ముందుకు రావడం లేదా? తాజా గణాంకాలు పరిశీలిస్తే దేశంలో 75కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యా సంవత్సరంలోనే ఈ పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఇంజనీరింగ్ కళాశాలు మూతపడే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి నిధుల కొరత అలాగే ప్రవేశాలు తగ్గిపోవడమేనని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2018-19 విద్యా సంవత్సరంలో సుమారు 54 ఇంజనీరింగ్ కాలేజీలు మూడపడ్డాయి. అంతకు ముందు అంటే 2017-18లో అయితే ఏకంగా 106 కాలేజీలు మూసేశారు. కొత్త విద్యార్థులు చేరకపోవడం, సీనియర్లతో కాలేజీలను నడపడం తలకుమించి భారంగా మారడంతో మూసేయడమే మంచిదని యాజమాన్యాలు నిర్ణయించుకుంటున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో 31, పంజాబ్‌లో ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు మూతకు సిద్ధంగా ఉన్నాయని ఏఐసీటీఈ వర్గాలు తెలిపాయి. మూతపడే కాలేజీల జాబితాను ఏఐసీటీఈ వెల్లడించింది. చత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో ఐదేసీ కాలేజీలు, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో రెండేసి కాలేజీల చొప్పున మూతపడనున్నాయి. ఏఐసీటీఈ గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 264 ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సిల్ అనుమతి లేకుండా నడుస్తున్నాయి. అలాగే 116 ఆర్కిటెక్చర్ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి లేదు. అవన్నీ అనధికారికంగానే నడస్తున్నట్టు లెక్క.