జాతీయ వార్తలు

దద్దరిల్లిన లోక్‌సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: కర్నాటకలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు శుక్రవారం లోక్‌సభను కుదిపివేశాయి. బీజేపీ నాయత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రాష్ట్రాలలోని ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కాగానే కర్నాటక అంశాన్ని లేవనెత్తారు. తమకు న్యాయం చేయాలంటూ గొడవ చేశారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఇస్తూ దాదాపు పది నిమిషాల పాటు సభను స్తంభింపజేశారు. అయితే స్పీకర్ ఓం బిర్లా మాత్రం కాంగ్రెస్ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. ‘ప్రశ్నోత్తరాల కార్యక్రమం అత్యంత ముఖ్యమైంది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే జీరో అవర్‌లో మాట్లాడేందుకు అనుమతి ఇస్తాను’అని స్పీకర్ చెప్పారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు శాంతించారు. జీరో అవర్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఇతర సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలు తిరస్కరించినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వాయిదా తీర్మానాలను తిరస్కరించినా కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్‌రంజన్ చౌదరికి మాట్లాడే అవకాశం ఇస్తున్నానని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అయా రాష్ట్రాలలోని ఎన్నికైన ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చివేసే కుట్ర చేస్తోందని చౌదరి ఆరోపించారు. కర్నాటకలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కర్నాటక పరిణామాలపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై సభలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానం ఇస్తారని ఆశించామని ఆయన చెప్పారు. వాయిదా తీర్మానాన్ని ఆమోదించకపోవటం దురదృష్టకరమని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘మీరు లోక్‌సభలో ఏదైనా రూలింగ్ ఇచ్చిన తరువాత రాష్టప్రతి వచ్చి స్పీకర్ ఇచ్చిన రూలింగ్ అమ లు చేయకూడదని ఆదేశించగలుగుతారా?’అని అధీర్‌రంజన్ చౌదరి ప్రశ్నించారు. లోక్‌సభ స్పీకర్ వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ కాబట్టి లోక్‌సభ వ్యవహారాల్లో రాష్టప్రతి జోక్యం చేసుకోలేరని ఆయన చెప్పారు. లోక్‌సభ స్పీకర్ మాదిరిగానే ఆయా రాష్ట్రాలలోని శాసన సభల స్పీకర్లు కూడా స్వతంత్రంగా వ్యవహరించవలసి ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు. శాసన సభ స్పీకర్ వ్యవహారాల్లో గవర్నర్ తల దూర్చలేరని ఆయన అన్నారు. కర్నాటకలో దీనికి విరుద్ధంగా జరుగుతోందని అధీర్‌రంజన్ చౌదరి చెప్పగానే అధికార పక్షం సభ్యు లు లేచి తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు. అధీర్ మాట్లాడేందుకు వీలు లేదని వాదించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. కర్నాటక శాసన సభలో గురువారం బలపరీక్ష జరగాల్సి ఉంది. కానీ బీజేపీ సభ్యులు గొడవ చేయటంతో ఆగిపోయిందన్నారు. చౌదరి వ్యాఖ్యలపై అధికార సభ్యులు తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు. పలువురు బీజేపీ సభ్యులు లేచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటం తో సభ దద్దరిల్లిపోయింది. అధీర్‌రంజన్ చౌదరి, విపక్ష సభ్యులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అధికార పక్షం పేర్కొంది. కాంగ్రెస్, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలోని సభ్యులే శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే బీజేపీని విమర్శించడం ఏమిటనీ వారు నిలదీశారు. స్పీకర్ తదుపరి అంశా న్ని చర్చకు చేపట్టి సభను అదుపులోకి తెచ్చారు.