జాతీయ వార్తలు

గిరిజనులపై దురాగతాలకు కాంగ్రెస్-బీజేపీదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 19: దేశంలో గిరిజనులపై జరుగుతున్న దాడులకు, దురాగతాలకు, అత్యాచారాలకు కాంగ్రెస్, బీజేపీలే నైతిక బాధ్యత వహించాలని బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్‌పి) అధినేత్రి మాయావతి ఆరోపించారు. కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఆదివాసులపై అనేక రకాల దాడులు జరిగాయని ఆమె ఆరోపిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సోనభద్ర గొడవల్లో మృతి చెందిన 10 మంది కుటుంబాలను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీలను అడవుల నుంచి తరిమి వేయడం జరిగిందని, దీంతో కొంత మంది నక్సల్స్‌ను ఆశ్రయించారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత సోనభద్ర నుంచి ఆదివాసీలను వెళ్ళగొట్టారని, ఇంకా 10 మందిని హతమార్చారని ఆమె విమర్శించారు. సోనభద్ర కాల్పుల్లో మరణించిన వారికి న్యాయం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నదని ఆమె తెలిపారు. గిరిజనులపై ఎక్కడైనా అత్యాచారాలు, దురాగతాలు జరిగితే కాంగ్రెస్, బీజేపీ నాయకులు మొసలి కన్నీరు కారస్తున్నారని మాయావతి మండిపడ్డారు.