జాతీయ వార్తలు

స్పీకర్‌ను గవర్నర్ ఆదేశించవచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: కర్నాటక రాజకీయ సంక్షోభం రాజ్యాంగ సంక్షోభంగా మారుతున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయడంపై గవర్నర్‌కు ఉన్న అధికారాలకు సం బంధించి నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగంలోని 175వ అధికరణ ప్రకారం అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశం జారీ చేసే అధికారం గవర్నర్‌కు ఎంతైనా ఉందని ఈ ఆదేశాన్ని అమలు చేయాల్సిన బాధ్యత శాసనసభపై ఉందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ అన్నారు. అలాగే రాజ్యాంగంలోని 168వ అధికరణ ప్రకారం గవర్నర్ కూడా రాష్ట్ర శాసనసభలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. అయితే కర్నాటక కేసుకు సంబంధించి లోక్‌సభకు చెందిన మాజీ సెక్రటరీ జనరల్ పీడిటి ఆచారి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక కేసుకు సంబంధించి 170వ అధికరణ నిర్వచన పరిథిని రాష్ట్ర గవర్నర్ విస్తరించారని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లు లేదా బిల్లులకు సంబంధించి మాత్రమే గవర్నర్ సభకు లేదా సభలకు సందేశం పంపే అవకాశం ఉందని వివరించారు.
కేవలం పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబంధించి మాత్రమే గవర్నర్ ఇలాంటి ‘సందేశాలు’ పంపేందుకు ఈ అధికరణ వీలు కల్పిస్తోందని ఆచార్య స్పష్టం చేశారు. ఈ అధికరణలో పేర్కొన్న ‘లేదా, మరో విధంగా’ అన్న పదాల నిర్వచన పరిథిని గవర్నర్ విస్తరించారని, సభా కార్యకలాపాలు ఎలా నిర్వహించాలన్న అంశానికి సంబంధించి ఇవి వర్తించవని ఆయన తేల్చి చెప్పారు. కర్నాటక విషయంలో రాష్ట్ర గవర్నర్ అసాధారణ రీతిలోనే వ్యవహారించారని, అయితే అంతిమంగా ఈ విషయంలో గవర్నర్‌కు ఉన్న అధికారం ఏమిటన్నది కోర్టు తేల్చాల్సి ఉంటుందని ఆయన వివరించారు. సభా కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి స్పీకర్‌కు మాత్రమే నిర్ణయాధికారం ఉంటుందని, దీనిపై ఎవరూ అధికారాన్ని చెలాయించే వీలు లేదని ఆయన తేల్చి చెప్పారు. కర్నాటక అసెంబ్లీ విశ్వాస పరీక్షను శుక్రవారం నాడే పూర్తి చేయాలని ఆదేశిస్తూ గవర్నర్ రెండు సార్లు డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో రాజ్యాంగ నిపుణులు స్పందించారు.