జాతీయ వార్తలు

అందరి దృష్టీ ఆ పులిపైనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాణభయం... అమ్మో ఇది తల్చుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది ఎవరికైనా.. దీనికి కేవలం మనుషులు మాత్రమే అనుకొంటే మనం తప్పులో కాలేసినట్లే.. ప్రాణభయానికి కారెవరూ అనర్హులు అనడానికి కించిత్ ఉదాహరణ అస్సాం వరద బీభత్సంలో చిక్కుకొన్న జంతుజాలమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.. భయం అందులోనూ ప్రాణానికి ముప్పు వాటిల్లేటంతగా వరద తీవ్రత ఉండడంతో అస్సాంలోని వేర్వేరు జంతు ప్రదర్శనశాలలు, అడవుల్లోని అడవి దున్నలు, చిరుత పులులు, అడవికే రాజుగా చెప్పుకొనే సింహాలు, గజరాజుల దగ్గర నుంచి చిన్నపాటి చిలుకలు, జింకలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల వన్యప్రాణులు చిగురుటాకులా వణికిపోయాయి.. విలవిల్లాడిపోయాయి.. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాయి. ఖడ్గమృగాల దగ్గర నుంచి పులల వరకూ ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లి తలదాచుకొనే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా అస్సాంలోని కజరింగ జాతీయ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్ ప్రాణభయంతో తలదాచుకోవడానికి ఎత్తయిన ప్రదేశంలోని ఓ ఇంట్లోకి దూరి అక్కడి బెడ్‌పై బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ సేద తీరుతున్న వైనం యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. ఈ చిరుతపులి బెడ్‌పై ఉన్న తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.. కాగా, ఈ రాయల్ బెంగాల్ టైగర్‌తో పాటు ఇతర జంతువులను కాపాడేందుకు అటవీశాఖ సర్వశక్తులనూ ఒడ్డుతోంది.

చిత్రం...ఇంట్లో పులి