జాతీయ వార్తలు

టీఆర్‌ఎస్ ఎంపీలకు బీజేపీ గాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు ఈ విషయంపై బీజేపీ సభ్యులతో గొడవ పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడొకరు ఇటీవల రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ద్వారా టీఆర్‌ఎస్‌కు చెందిన మరో ముగ్గురు సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌కు రాజ్యసభలో ఆరుగురు సభ్యులున్నారు. వీరిలో నలుగురు సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నాయకులు తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో గొడవపడిన డి.శ్రీనివాస్ కొంతకాలం నుండి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గత వారం ఆయన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. మర్యాదకోసమే కలుసుకున్నారని చెబుతున్నా వాస్తవానికి టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులను బీజేపీ తిప్పుకోవటం గురించి చర్చించారనే మాట వినిపిస్తోంది. శ్రీనివాస్ ఒక్కరే బీజేపీలో చేరితే పార్టీ ఫిరాయిపుల చట్టం కింద ఆయన సభ్యత్వం పోతుంది. శ్రీనివాస్‌తోపాటు మరో ముగ్గురు సభ్యులను ఆకర్షించటం ద్వారా టీఆర్‌ఎస్ రాజ్యసభ పక్షంలో చీలిక తీసుకురావాలన్నది బీజేపీ వ్యూహమని అంటున్నారు. తెలుగుదేశం రాజ్యసభ పక్షాన్ని చీల్చినట్లు టీఆర్‌ఎస్ రాజ్యసభ పక్షాన్ని కూడా చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి, ఉపనాయకుడు సీఎం రమేష్‌తోపాటు గరికపాటి రామ్మోహన్
రావు, టీజీ వెంకటేష్ టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయటం తెలిసిందే. టీడీపీకి ఆరుగురు రాజ్యసభ సభ్యులుంటే ఇందులో నుండి నలుగురు బీజేపీలో చేరిపోయారు. ఇదే వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌పై ప్రయోగించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఈ వ్యూహాన్ని పసిగట్టిన కేశవరావు ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వానికి తెలియజేశారని.. ఆ వెంటనే తమ సభ్యులను కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్ అధిష్ఠానం పలు చర్యలు తీసుకున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ బీజేపీ అధినాయకత్వం మాత్రం తమ ప్రయత్నాలను విరమించుకున్న సూచనలు కనిపించటం లేదని అంటున్నారు.