జాతీయ వార్తలు

నిషేధం ప్రసక్తి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: సమీప భవిష్యత్తులో పెట్రోలు, డీజిలు వాహనాలను పూర్తిగా నిషేధించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ఇంధన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఇంధన వాహనాలను తగ్గిస్తామన్నారు. అయితే 2030 సంవత్సరం తర్వాత కేవలం ఎలక్రిక్ వాహనాలు మాత్రమే ఉండాలని నీతి ఆయోగ్ ప్రతిపాదన అని ఆయన తెలిపారు. నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అమితాబ్ కాంత్ మూడు, ద్విచక్ర వాహనాలు అంటే 150-సీసీ లోపు ఉన్న వాటినే మాత్రమే 2025 సంవత్సరం నుంచి అనుమతించాలని సూచించారని చెప్పారు. పెట్రోలు, డీజిలు వాహనాలను రద్దు చేస్తున్నట్లు వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. ఫలనా తేదీ నుంచి పెట్రోలు, డీజిలు వాహనాలపై నిషేధం విధించనున్నట్లు మన దేశం ఒక్కటే నిర్ణయం తీసుకోలేదన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు సీఎన్‌జీ, పీఎన్‌జీ, బయోఫ్యూల్స్, బయోగ్యాస్ వాహనాల అవశ్యకత ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు.