జాతీయ వార్తలు

33 జిల్లాలూ మునక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి : అస్సాంలో కుంభవృష్టి ఫలితంగా తలెత్తిన వరద పరిస్థితి మంగళవారం మరింత ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 17కు పెరిగింది. దాదాపు 45 లక్షల మంది వరదల కారణంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వరద ముంపునకు గురైన జిల్లాల్లో బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాద స్థాయి నుంచి ప్రవహిస్తున్నాయని రాష్ట్ర విపత్తుల నివారణ కమిటీ వెల్లడించింది. రాష్ట్ర రాజధాని గౌహతి కూడా వరద ముంపునకు గురి కావడంతో జన జీవనం స్తంభించింది. రాష్ట్రంలోని 4,620 గ్రామాల్లో 45 లక్షల మంది వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నారని లక్షలాది మందిని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. దెబ్బతిన్న ప్రజలను ఆదుకునేందుకు 562 ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారవర్గాలు వెల్లడించాయి. అనేక చోట్ల వర్షాల కారణంగా కొండ చెరియలు విరిగిపడ్డాయని, తాజాగా మరో ఇద్దరు మృతి చెందడంతో, మృతుల సంఖ్య 17కు పెరిగిందన్నారు.
ఇటు సైనిక దళాలు, అటు బీఎస్‌ఎఫ్ దళాలు సహాయక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నట్లు చెప్పారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలన్నింటిలోనూ నిరంతరం సహాయ చర్యలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. బ్రహ్మపుత్రా నది పోటేత్తడంతో అనేక ప్రాంతాలు మునిగిపోయాయని తెలిపారు.
చిత్రం...అస్సాంలో వరద ముంపునకు గురైన ప్రాంతాలు
(ఇన్‌సెట్‌లో ) ఎరియల్ సర్వే చేస్తున్న కేంద్ర జలశక్తి మంత్రి గేజంద్ర సింగ్ షెకావత్