జాతీయ వార్తలు

రైతు బిడ్డలకు పెళ్లిళ్లు కావడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది.. కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటే తప్ప ఈ సంక్షోభం నుండి బైటపడలేదని వైసీపీ సభ్యుడు బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మంగళవారం లోక్‌సభలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమం శాఖల పద్దులపై జరిగిన చర్చలో బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతం తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. నిరుద్యోగం పెద్ద సమస్యగా తయారైందని ఆయన చెప్పారు. రైతులకు పిల్లల్ని ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో పెళ్లిళ్లు కూడా జరగటం లేదని ఆయన వాపోయారు. వ్యవసాయాభివృద్ధి బాగా తగ్గిపోయింది.. దీని మూలంగా గ్రామీణ ప్రాంతాల వేతనాలు కూడా బాగా పడిపోయాయని బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
కనీస మద్దతు ధరను నిర్ణయించేందుకు అనుసరిస్తున్న విధానం సరైందని కాదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ఆశించిన లక్ష్యాలను సాధించటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రైతుల ఆదాయం రెండింతలైతే వారి పిల్లలు ఉపాధి కోసం ఇతర రంగాలవైపు చూడరని ఆయన అన్నారు. రాయలసీమలో యువకులు సైతం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.. ఈ ప్రాంతంలో తాగునీటి కొరత ఏర్పడిందని ఆయన చెప్పారు. కేసీ కాలువకు అవసరమున్నంత నీరు రావడం లేదని.. గండ్రేవుల వద్ద రిజర్వాయర్ నిర్మించటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని బ్రహ్మానంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గోదావరిని కృష్ణా నదితో కలిపే బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం వలన రెండు రాష్ట్రాల్లో సాగునీరు, తాగునీరు సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు. కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమలో అన్ని రకాల నేలలు ఉన్నందున విత్తనాల ఉత్పత్తికి మంచి అవకాశాలున్నాయని ఆయన సూచించారు. కర్నూలు జిల్లాలో వ్యవసాయ కాలేజీ, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.