జాతీయ వార్తలు

హోదా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చేతులు జోడించి కోరుతున్నామని వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాలశౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. బాలశౌరి, శ్రీనివాసులు రెడ్డి మంగళవారం లోక్‌సభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని చెప్పారు. తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు 3,700 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు.. ప్రజల కష్టాలు తీరాలంటే ప్రత్యేక హోదా ఎంతో అవసరమని బాలశౌరి వాదించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని శ్రీనివాసులు రెడ్డి ప్రధాన మంత్రిని కోరారు. రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుంటేనే ఏపీపి అభివృద్ధి చెందుతుందని అన్నారు. విజయవాడ విమానాశ్రయం విస్తరణకు 698 ఎకరాల భూమిని సేకరించినా ఇంతవరకు నిధులు కేటాయించలేదని బాలశౌరి చెప్పారు. విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్-9 విస్తరణ, మచిలీపట్నం-అవనిగడ్డ జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని బాలశౌరి విజ్ఞప్తి చేశారు. జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వం మూలంగానే తమ పార్టీ 23 లోక్‌సభ, 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నదని ఆయన అన్నారు. 37వ ఏట పార్టీ పెట్టి పదేళ్లపాటు అవిశ్రాంతంగా కృషిచేసి జగన్ అధికారంలోకి వచ్చారని బాలశౌరి తెలిపారు. తమ నాయకుడు కోరిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని ఇరువురు నాయకులు ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు.