జాతీయ వార్తలు

ఆరోగ్య సూచి.. కేరళే మేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడంలో, అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో కేరళ టాప్‌లో నిలువగా, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ద్వితీయ స్థానంలో, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ చివరి స్థానంలో నిలిచాయి. నీతి ఆయోగ్ వెలువరించిన రెండవ దశ ఇండెక్స్‌లో పేర్కొంది. మూడు క్యాటగిరిల్లో ర్యాంక్‌లను ప్రకటించింది. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మూడు విభాగాలుగా గుర్తించింది. ఇలాఉండగా వైద్య వౌలిక సదుపాయాల కల్పనలో గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాలు దక్కాయి. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాలు చాలా అద్వాన్నంగా ఉన్నట్లు ఇండెక్స్‌లో వెల్లడైంది.
ఇక పని తీరును పెంచుకుంటున్న రాష్ట్రాల్లో హర్యానా, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలు ముందు వరుసలో నిలిచాయి. 2015-16 నుంచి 2017-18 సంవత్సరం వరకు వైద్య ఇండెక్స్‌ను పరిశీలిస్తే 23 ఇండికేటర్స్ వైద్య సౌకర్యాల్లో ప్రాముఖ్యతను కనబరిచాయి. చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే మిజోరం అన్ని విధాలా ప్రథమ స్థానంలో నిలిచింది. త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలు ఈ సౌకర్యాల కల్పనలో తమ పని తీరును మెరుగుపరచుకుంటున్నాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మాత్రం బాగా వెనుకబడ్డాయి. చత్తీస్‌గడ్ ప్రథమ స్థానం లో, దాద్రా, నగర్ హవేలీ మెరుగుపరచుకుంటున్నాయని నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం, అన్ని సౌకర్యాలు కల్పించడం, అందరికీ ఆరోగ్యంపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు. నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్‌కుమార్ పాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులు కేటాయిస్తూ చర్యలు చేపట్టాలని అన్నారు. టీబీ చికిత్సలో బాగా విజయం సాధించామని ఆయన తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు, సౌకర్యాలు కల్పించాలని ఆయన చెప్పారు.
చిత్రం...ఆరోగ్య సూచీ నివేదికను మంగళవారం ఢిల్లీలో విడుదల చేస్తున్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ ఖాన్, సభ్యుడు వీకే పాల్